అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Budget Bias | బడ్జెట్‌లో ఇందూరుపై (Telangana budget) కాంగ్రెస్ సర్కారు వివక్ష చూపిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆరోపించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Nizamabad Budget Bias | గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి..
గ్యారంటీల పేరుతో గద్దెనెక్కి.. ఇప్పుడు ఆ ‘ఆరు గ్యారంటీల’ను పాతాళంలో పాతేసిన దగాకోరు బడ్జెట్ ఇది అని దినేష్ కులాచారి విమర్శించారు. పేదలను నట్టేట ముంచి, సకల జనులను నిరాశలో నెట్టేసిన బడ్జెట్‌ను ప్రజలు ఆమోదించడం లేదన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం (Nizamabad news) సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, గల్ఫ్‌లో మరణించిన (Gulf workers welfare) కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. బడ్జెట్‌లో గల్ఫ్ బాధితులకు చిల్లిగవ్వ కేటాయించకపోవడం వారిని ద్రోహం చేయడమేనన్నారు.
Nizamabad Budget Bias | చక్కెర కర్మాగారాలు తెరిపించరా..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోపు చక్కెర కర్మాగారాలను (farmers issues India) తెరిపిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి.. ప్రస్తుత బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం జిల్లా రైతాంగాన్ని మోసం చేయడమేనని దినేష్ ఆరోపించారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.
Nizamabad Budget Bias | అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితమా?
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిజామాబాద్‌లోని ‘తెలంగాణ యూనివర్సిటీ’ (Telangana University) అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి ప్రస్తావించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఈ బడ్జెట్ ఇందూర్ జిల్లా రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని ప్యాకేజీ 21, 22 పనులకు, అలాగే మంచిప్ప (మాసాని) రిజర్వాయర్‌కు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందన్నారు. ఇటీవల ఇందూర్కు వచ్చిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, కానీ తాజా బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదని వివరించారు.
గారడి మాటలతో..
గారడీ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. బడ్జెట్‌లో మాత్రం ప్రజల గొంతు కోసిందని దినేష్ అన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, యువత వ్యతిరేక (Telangana politics) బడ్జెట్ అని అభివర్ణించారు. ఇందూరు జిల్లా అభివృద్ధికి, మూతపడిన చక్కెర ఫ్యాక్టరీకి, (BJP vs Congress) తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపిన ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
23న కలెక్టరేట్ ముట్టడి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల (development funds India) అమలులో వైఫల్యాలను నిరసిస్తున్నామని దినేష్ అన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు 23న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తరలివచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, ఓం సింగ్ నాయక్, పుట్ట వీరేందర్, బొబ్బిలి వేణు, ఇందూర్ సుధ, గడ్డం రాజు, అంబదాస్ రావు, ఆనంద్ విజయ్ కృష్ణ, ఆనంద్, బుల్లెట్ శీను తదితరులు పాల్గొన్నారు.

