Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు

జాతీయం

LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు

గ్యాస్​ సిలిండర్లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి రాష్ట్రాలకు అదనంగా 20 శాతం గ్యాస్​ సరఫరా చేస్తామని తెలిపింది.

Srinivas kolluri
Last updated: మార్చి 21, 2026 6:40 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
LPG cylinder supply

అక్షరటుడే, వెబ్​డెస్క్ : LPG cylinder supply | గ్యాస్​ సిలిండర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎల్లుండి నుంచి రాష్ట్రాలకు 20 శాతం అదనంగా గ్యాస్​ సిలిండర్లు సరఫరా చేస్తామని తెలిపింది.

Contents
  • LPG cylinder supply | వాణిజ్య సిలిండర్లు
    • LPG cylinder supply | నమోదు చేసుకోవాలి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్​ సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం వాణిజ్య సిలిండర్ల (Commercial cylinders)పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో అనేక హోటళ్లు మూతబడ్డాయి. తాజాగా పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (Ministry of Petroleum and Natural Gas) ప్రకటన విడుదల చేసింది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 20 మార్చి 23 నుంచి అదనంగా మరో 20 శాతం గ్యాస్​ సరఫరా చేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్​ కేటాయింపులు సంక్షోబానికి కంటే ముందు స్థాయిలలో 50 శాతానికి చేరనుంది. ఈ పెంచిన కేటాయింపుల లక్ష్యం కీలక రంగాలకు, ముఖ్యంగా ఆహార సరఫరా, ప్రజా సంక్షేమానికి సంబంధించిన వాటికి మద్దతు ఇవ్వడమేనని పెట్రోలియం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ తెలిపారు.

LPG cylinder supply | వాణిజ్య సిలిండర్లు

యుద్ధం ప్రభావంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రధాన నగరాల్లోని అనేక హోటళ్లు (Hotels), హాస్టళ్లు మూతబడ్డాయి. అదనపు కేటాయింపుల్లో రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్వహిస్తున్న క్యాంటీన్లు/అవుట్‌లెట్‌లు, కమ్యూనిటీ కిచెన్‌లు సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్ (FTL) సిలిండర్​ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది.

LPG cylinder supply | నమోదు చేసుకోవాలి

తాజాగా కేటాయించిన సిలిండర్లలో అర్హత పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక ఎల్‌పీజీ వినియోగదారులందరూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) వద్ద నమోదు చేసుకోవాలని కేంద్రం పేర్కొంది. మార్చి 19తో ముగిసిన వారంలో దేశ ఎల్​పీజీ దిగుమతులు 265,000 టన్నులకు పడిపోయాయి. మార్చి 5 నాటి 322,000 టన్నుల నుంచి పశ్చిమ ఆసియా నుండి దిగుమతులు మార్చి 19తో ముగిసిన వారంలో కేవలం 89,000 టన్నులకు పడిపోయాయి. అయితే ప్రత్యామ్నాయ ప్రాంతీయ సరఫరాలు మార్చి 19తో ముగిసిన వారంలో 176,000 టన్నులకు పెరిగాయని, వీటిలో అధికభాగం అమెరికా నుంచే వచ్చాయని నివేదిక పేర్కొంది.

cylinders

దీనిని కూడా చదవండి : Air India Flight Return | 8 గంటలు ప్రయాణించి తిరిగొచ్చిన విమానం.. ప్రయాణికులకు చేదు అనుభవం

Jhansi Cylinder Theft Case | సిలిండర్ల లారీ దొంగతనం కేసు.. ఛేదించిన ఝాన్సీ పోలీసులు
Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు
Traffic Problems | ట్రాఫిక్‌లోనే సగం జీవితం!
Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
TAGGED:commercial cylindersGas Cylinder Shortagegas price updateindia lpg newsLPG supplypetroleum ministry
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ramzan charity message Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్​ పరమార్థం: షబ్బీర్ అలీ
Next Article Modi Iran Call Modi Iran Call | ఇరాన్​ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?