అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Global Crisis Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధం భారత్‌కే కాదు, ప్రపంచానికే ఆందోళనకర విషయమన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తరాఖండ్‌లో జరిగిన సభలో రక్షణ మంత్రి స్పందించారు. భారత వైఖరిని ప్రధాని చెప్పారన్నారు. చర్చలు, దౌత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించినట్లు తెలిపారు. ఇంధన, ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రపంచ సమస్యకు సంభాషణలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని సూచించారు.
Global Crisis Warning | ప్రధాని నాయకత్వంలో..
ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రధాని చేస్తున్న కృషికి దేశ ప్రజలు మద్దతు తెలపాలని రాజ్‌నాథ్ సింగ్ కోరారు. మోదీ నాయకత్వంతో ప్రపంచ వేదికపై భారతదేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చారన్నారు. నేడు అంతర్జాతీయ వేదికలపై భారత్ మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం అత్యంత ఏకాగ్రతతో ఆలకిస్తుంది అని పేర్కొన్నారు.
Global Crisis Warning | ధురంధర్ ధామి
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వ సామర్థ్యాలను కొనియాడుతూ “ధురంధర్ ధామి”గా రక్షణ మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయనే కారణమని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన కాలాన్ని కూడా సింగ్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
దీనిని కూడా చదవండి : Modi Iran Call | ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ

