అక్షరటుడే, కామారెడ్డి: Auto Accident Kamareddy | అదుపుతప్పి ఆటో బోల్తాపడి (Road Accident India) ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండల (Kamareddy Accident) కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
Auto Accident Kamareddy | రంజాన్ వేడుకల్లో భాగంగా..
పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కల్వరాల గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం ఇద్దరు చిన్నారులతో కలిసి ఆటోలో కామారెడ్డికి (Kamareddy) రంజాన్ వేడుకల్లో (Ramadan Travel Incident) పాల్గొనేందుకు బయలుదేరారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని లక్ష గార్డెన్ సమీపంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఇందులో ఒక చిన్నారికి (Local News India) స్వల్ప గాయం కాగా మరొక చిన్నారికి తలకు బలమైన గాయమైంది. వెంటనే వారిని హైవే అంబులెన్సులో జీజీహెచ్‌కు (GGH kamareddy) తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ramzan charity message | పేదలకు సహాయం చేయడమే రంజాన్ పరమార్థం: షబ్బీర్ అలీ

