అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dhurandhar Box Office | భారత చలన చిత్ర పరిశ్రమలో మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలవ బోతోంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.448 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాలను మించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
Dhurandhar Box Office | థియేటర్లు హౌస్‌ఫుల్..
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తొలి రోజే భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం, రెండు రోజు, మూడో రోజు కూడా అదే జోరుతో కొనసాగింది.
Dhurandhar Box Office | అంతర్జాతీయంగా..
విదేశీ మార్కెట్లలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యూకే, అమెరికాతో సహా గల్ఫ్ దేశాల్లో కలెక్షన్లు గణనీయంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ‘ధురంధర్: ది రివెంజ్’ అతి త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
నిపుణుల అంచనా ప్రకారం.. వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ కలెక్షన్లు స్థిరంగా ఉంటే.. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, విడుదలైన కొద్ది రోజుల్లోనే పెట్టుబడిని తిరిగి సాధించుకునే దిశగా వేగంగా దూసుకుపోతోంది.
ఇది కూడా చదవండి: Dhurandhar 2 Review | ధురంధర్ 2పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. యాక్టింగ్ మాస్టర్‌క్లాస్ అని వ్యాఖ్య..

