Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ

‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ హైదరాబాద్‌లో సంగీతాభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. 

Naresh chandan
Last updated: మార్చి 22, 2026 12:31 ఉద.
Naresh chandan
7 రోజులు ago
Share
Anirudh Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
Anirudh Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ

అక్షరటుడే, హైదరాబాద్: Anirudh Concert | గ్రేటర్​ హైదరాబాద్ నగరం శనివారం సాయంత్రం సంగీత మయంగా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV – మీతో 15 సంవత్సరాలు’ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు.

Contents
  • Anirudh Concert | ప్రేక్షకుల్లో ఉత్సాహం..
    • Anirudh Concert | ట్రాఫిక్​ రద్దీ..

గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సంగీత వేడుక రాత్రి వరకు అభిమానులను అలరించింది.akshara anirudh 2

Anirudh Concert | ప్రేక్షకుల్లో ఉత్సాహం..

అనిరుధ్ తెలుగు, తమిళ హిట్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రత్యేక లైటింగ్ ఎఫెక్ట్స్, సౌండ్ సిస్టమ్, స్టేజ్ ప్రదర్శన అలరించడంతో కచేరీకి వచ్చిన యువత, సంగీతాభిమానులు మంత్ర ముగ్ధులయ్యారు. ప్రతి పాటకు ప్రేక్షకులు స్పందిస్తూ స్టేడియంను ఉత్సాహంతో నింపారు.

అనిరుధ్ సంగీత ప్రయాణానికి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తన కెరీర్‌లోని ప్రముఖ గీతాలను ప్రత్యక్షంగా వినిపిస్తూ అభిమానులతో తన ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు.

Anirudh Concert | ట్రాఫిక్​ రద్దీ..

అనిరుధ సంగీత విభావరిని తిలకించేందుకు దాదాపు 30 వేల మంది టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ కచేరీ సందర్భంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. పోలీసులు ముందస్తుగా ప్రకటించిన ట్రాఫిక్ సూచనల ప్రకారం కొన్ని మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఐఐఐటీ జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే మార్గాల్లో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజా రవాణా వినియోగించిన వారికి కొంతవరకు సౌలభ్యం ఏర్పడింది.

టిక్కెట్లు ముందుగానే హౌస్‌ఫుల్ కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లు సైతం కట్టుదిట్టంగా నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
Telangana Power Demand | భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు! Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!
Next Article March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు! March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?