Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!

బిజినెస్​తాజా వార్తలు

March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!

కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా క్షీణించి కొత్త కనిష్ఠాలను తాకుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లపై అనిశ్చితి ప్రభావంతో మార్కెట్‌లో పతనం కొనసాగుతోంది. ఈ పతనం తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Naresh chandan
Last updated: మార్చి 22, 2026 8:40 ఉద.
Naresh chandan
5 రోజులు ago
Share
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!

అక్షరటుడే, హైదరాబాద్: March 22 Gold Rates | కొద్ది రోజుల క్రితం రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు Silver Prices ప్రస్తుతం అదే వేగంతో పడిపోతూ మార్కెట్‌లో కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఈ ధరల పతనం కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

Contents
  • March 22 Gold Rates | క్ర‌మంగా త‌గ్గుద‌ల‌..
    • March 22 Gold Rates | ప్రధాన నగరాల్లో ధ‌ర‌లు చూస్తే..

తాజా సమాచారం ప్రకారం, మార్చి 22 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర రూ.1,33,800కు చేరుకుంది. వెండి ధర కూడా గణనీయంగా తగ్గి కిలోకు రూ.2.5 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. శనివారం ఒక్కరోజులోనే బంగారం ధరలు దాదాపు రూ.2,940 మేర పడిపోవడం గమనార్హం.

March 22 Gold Rates | క్ర‌మంగా త‌గ్గుద‌ల‌..

అలాగే వెండి ధరలు కూడా కిలోకు సుమారు రూ.10,000 వరకు తగ్గాయి. గత కొంతకాలంగా ధ‌ర‌ల‌ పెరుగుదలతో కొనుగోలుదారులకు అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడటంతో మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

ఒకవైపు కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని భావించే వారు ఉండగా, మరోవైపు ఇంకా ధరలు పడే అవకాశం ఉందని భావించి వేచి చూస్తున్నవారూ ఉన్నారు. ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా America కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లలో తగ్గింపు ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

March 22 Gold Rates | ప్రధాన నగరాల్లో ధ‌ర‌లు చూస్తే..

  • చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,48,580గా ఉండగా, 22 క్యారెట్ ధర రూ.1,36,200గా ఉంది.
  • ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,45,970గా, 22 క్యారెట్ ధర రూ.1,33,800గా కొనసాగుతోంది.
  • న్యూఢిల్లీలో New Delhi 24 క్యారెట్ ధర రూ.1,46,120గా, 22 క్యారెట్ ధర రూ.1,33,950గా ఉంది.
  • వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,46,020గా, 22 క్యారెట్ ధర రూ.1,33,850గా నమోదైంది. వెండి ధరలు కూడా నగరాల వారీగా తగ్గుముఖం పట్టాయి.
  • చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,50,000గా ఉండగా, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణే, వడోదరా, అహ్మదాబాద్ నగరాల్లో రూ.2,45,000గా కొనసాగుతోంది.
Bengaluru Hotels Closed | బెంగళూరు భోజనప్రియులకు షాక్.. నేటి నుంచి హోటల్స్ బంద్​!
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Denza Z9 GT | ఐదు నిమిషాల్లో 70 శాతం చార్జింగ్.. అదుర్స్ అనిపించే ఫీచర్లతో బీవైడీ ఈవీ కారు
TAGGED:bullion market Indiagold price fallgold price today indiaGold Rate Hyderabadindia gold newsmarch 22 gold ratesprecious metals updateSilver price today
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు! March 22 Horoscope | తండ్రి సలహాతో విజయానికి పునాది.. ఈ రాశుల వారికి అఖండ లాభాలు!
Next Article Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?