Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..

సినిమా

Vijay Rashmika Honeymoon | సైలెంట్‌గా హ‌నీమూన్ చెక్కేసిన విరోష్ జంట‌..

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. కో సముయి ద్వీపంలో తీసిన రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 22, 2026 10:30 ఉద.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Vijay Rashmika Honeymoon

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Rashmika Honeymoon | ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహం అనంతరం విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. కో సముయి ద్వీపంలో తీసిన రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్‌గా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంధాన (Rashmika Mandanna) వివాహ వేడుకల సందడి ఇంకా తగ్గకముందే, ఇప్పుడు వారి హనీమూన్ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుక తర్వాత, ఈ కొత్త జంట తమ వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ జంట కో సముయి (Koh Samui) ద్వీపంలో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరాన, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఒక ప్రైవేట్ విల్లాలో వీరు గడుపుతున్న మధుర క్షణాలకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Vijay Rashmika Honeymoon | రొమాంటిక్ టూర్..

ఆ ఫొటోలో రష్మిక పసుపు రంగు ఫ్లోరల్ డ్రెస్‌లో అందంగా మెరిసిపోతుండగా, విజయ్ తన క్యాజువల్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు వెకేషన్స్ (Vacation) కోసం లగ్జరీ రిసార్ట్స్‌ను ఎంచుకోవడం సహజం. అయితే విజయ్, రష్మిక మాత్రం హడావుడి దూరంగా ఉండేలా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడానికి ప్రైవేట్ విల్లాను ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎంపిక వారి వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించిన ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

virosh

హనీమూన్ (Vijay Rashmika Honeymoon) అనంతరం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీ కానున్నారు. ర‌ష్మిక మంధాన ‘మైసా’ చిత్ర షూటింగ్‌లో పాల్గొననుండగా, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda)తో కలిసి ‘రణబాలి’ సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మొత్తంగా, ఈ జంట హనీమూన్ ఫొటోలు చూస్తుంటే వారి కొత్త జీవిత ప్రయాణం ఎంతో ఆనందంగా, ప్రేమతో నిండినదిగా ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది.

దీనిని కూడా చదవండి : Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!

Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
Gaddar Cinema Awards | గద్దర్​ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్​ రాంబాయి
Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..
TAGGED:celebrity honeymoonKoh Samui tripRashmika MandannaThailand vacationTollywood coupleVijay Deverakonda
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hormuz Strait Ultimatum Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం
Next Article Telangana Building Rules Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?