అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LPG Ship India | దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సరఫరా కొరత నెలకొన్న నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీ నౌక ఆదివారం మంగళూరులోని న్యూ మంగళూరు పోర్టు (New Mangalore Port)కు చేరుకుంది. పిక్సిస్ పయనీర్ (Pixis Pioneer) అనే షిప్ 16,714 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఇతర మార్గాల ద్వారా దిగుమతులను పెంచింది. అమెరికా (USA) నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ షిప్ భారత్‌కు చేరుకుంది. దీంతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. వచ్చే వారంలో 72,700 టన్నుల ఎల్పీజీ నౌక భారత్‌కు రానుంది. ఈనెల 25న 26,687 టన్నుల ఎల్పీజీతో రానున్న అపోలో ఓషన్, 29న 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత తీరానికి చేరుకోనున్నాయి.
LPG Ship India | 22 నౌకలు సేఫ్
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు నాలుగో వారంలోకి చేరుకున్నాయి. యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో భారత్‌కు చెందిన 22 నౌకలు చిక్కుకున్నాయి. అందులో 611 మంది నావికులు ఉన్నారు. భారత నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని నౌకా రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.
LPG Ship India | ఎల్‌పీజీ సంక్షోభం తగ్గుముఖం
గత కొన్ని వారాలుగా అనేక నగరాలు తీవ్రమైన ఎల్పీజీ సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎల్పీజీ సరఫరా నిలిచి పోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే సిలిండర్ల కోసం భయాందోళనలతో చేస్తున్న బుకింగ్‌లు గణనీయంగా తగ్గాయని అధికారులు తెలిపారు. గురువారం కేవలం 55 లక్షల బుకింగ్‌లు మాత్రమే నమోదయ్యాయని పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది.

దీనిని కూడా చదవండి : Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ

