అక్షరటుడే, ఎల్లారెడ్డి: CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ అన్నారు. గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయం వద్ద రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితో మా గ్రామం అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. వీటితో పనులు చేపడుతున్నామని చెప్పారు.
CC Road Works | ఎమ్మెల్యే చొరవతో..
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చొరవతో గ్రామాభివృద్ధకి నిధులు మంజూరవుతున్నాయని సర్పంచ్ తెలిపారు. సీసీ రోడ్లకు రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మహిళా సంఘ భవనం నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయించారని వివరించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సొంత నిధులతో బోరు వేయించారని తెలిపారు. అలాగే ఆగిపోయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు బిల్లులు మంజూరు చేయించారని చెప్పారు. గ్రామానికి 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించారన్నారు.
CC Road Works | ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా..
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీలు, కల్యాణలక్ష్మి చెక్కులు గ్రామ ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. ఇంతకాలం ఇన్ఛార్జి సెక్రెటరీతో ఉన్న గ్రామానికి వెంటనే కార్యదర్శిని ఎమ్మెల్యే నియమింపజేశారన్నారు. ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరేలా చూస్తున్న ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాజు యాదవ్, మాజీ సర్పంచ్ గోచిక చిరంజీవులు, సొసైటీ మాజీ వైస్ ఛైర్మన్ ఎల్లప్ప, వార్డు సభ్యులు గండ్ల సాయిరాం, నర్సింలు, బంధం భూమయ్య, బట్టి సాయిగౌడ్, నరేందర్ బాల్రాజ్, నాగరాజ్ ఆలయ అర్చకులు శివాయప్ప పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్పాల్

