అక్షరటుడే, కామారెడ్డి: Street Dog Attack | వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిపై దాడికి తెగబడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. ఇటీవల పోసానిపేట గ్రామంలో ఆరుగురిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
Street Dog Attack | దోమకొండ మండలంలో..
తాజాగా దోమకొండ మండలంలోని చింతమాన్ పల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆదివారం బయట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఐదేళ్ల చిన్నారి హర్షిని, 16 నెలల చిన్నారి జాహ్నవిలను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిన్నారుల పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఇద్దరిని హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి..: CC Road Works | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

