Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!

భక్తితాజా వార్తలు

Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!

శక్తి ఉన్న ప్రతి ఒక్కరు విశేష దినాల్లో ఈ స్వయంపాక దానాన్ని చేసి దైవానుగ్రహాన్ని పొందవచ్చు.

Naresh chandan
Last updated: మార్చి 22, 2026 5:37 సా.
Naresh chandan
3 రోజులు ago
Share
Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!
Swayampaka Danam | స్వయంపాక దానం ఎలా చేయాలి.. ఏ వస్తువులు ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Swayampaka Danam | హిందూ సనాతన ధర్మంలో దానానికి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. మనిషి తన జీవిత కాలంలో చేసే అనేక పుణ్యకార్యాలలో ‘అన్నదానం’ అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు.

Contents
  • Swayampaka Danam | మనుస్మృతి ఏం చెబుతోంది?
    • Swayampaka Danam | స్వయంపాకంలో ఉండాల్సినవి:
      • దాన విధి, ఫలితం:

అయితే, వండిన ఆహారాన్ని వడ్డించడమే కాకుండా, ఎదుటివారు తమకు నచ్చిన విధంగా, శుచిగా వండుకోవడానికి అవసరమైన అన్ని రకాల వస్తువులను సమకూర్చడాన్నే ‘స్వయంపాక దానం’ అంటారు.

పూజలు, పండుగలు, వివాహాది శుభకార్యాల సమయంలో బ్రాహ్మణులకు లేదా ఆకలితో ఉన్నవారికి స్వయంపాకం ఇవ్వడం మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక గొప్ప ఆచారం.

Swayampaka Danam | మనుస్మృతి ఏం చెబుతోంది?

మనుస్మృతి ప్రకారం (మన సంప్రదాయం ప్రకారం.. శాస్త్రబద్ధమైనది, పెద్దలు ఆమోదించిన మార్గం) స్వయంపాక దానం చేయడం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాదు.. ఆ కుటుంబానికి ఆరోగ్యం, వంశవృద్ధి కలుగుతాయని స్పష్టంగా పేర్కొన్నారు.

స్వయంపాకంలో ఇచ్చే పదార్థాలన్నీ సహజ సిద్ధమైనవి, ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం వల్ల, ఆ సరకులను స్వీకరించిన వారు పొందే శారీరక తృప్తి దాతకు శుభ ఫలితాలను ఇస్తుంది.akshara rice 1

Swayampaka Danam | స్వయంపాకంలో ఉండాల్సినవి:

స్వయంపాకం అంటే కేవలం బియ్యం ఇవ్వడం మాత్రమే కాదు. ఒక నిండు కుటుంబం ఒక పూట భోజనాన్ని సంపూర్ణంగా ముగించేందుకు అవసరమైన ప్రతి వస్తువు అందులో ఉండాలి.

కూరగాయలు: తోటకూర, దోసకాయ, వంకాయ, గుమ్మడికాయ వంటి కనీసం ఐదు రకాల తాజా కూరగాయలు ఉండాలి.

దినుసులు: నాణ్యమైన బియ్యం, కందిపప్పు, పెసరపప్పుతో పాటు రుచి కోసం చింతపండు, ఉప్పు, మిరపకాయలు, అల్లం, కొత్తిమీర తప్పనిసరి.

పాల ఉత్పత్తులు, ఇతరాలు: పాలు, పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, వంట నూనె , తేనెను కూడా జతచేయాలి.

శుభ సూచకాలు: కొబ్బరికాయ, అరటిపండ్లు, తాంబూలం (తమలపాకులు, వక్కలు), తీపి కోసం బెల్లం ఉండాలి.

దాన విధి, ఫలితం:

ఈ వస్తువులన్నింటినీ ఒక అరిటాకులో గానీ లేదా పెద్ద విస్తరిలో గానీ సర్ది, ఆపై తమ స్తోమతకు తగ్గట్టుగా ‘దక్షిణ’ (నగదు) ఉంచి పండితులకు లేదా పేదలకు సమర్పించాలి. ఆ సరుకులను అందుకున్న వారు తృప్తిగా వండుకుని భుజించిన తర్వాత, ‘అన్నదాతా సుఖీభవ’ అని మనస్ఫూర్తిగా దీవిస్తే.. ఆ దీవెన దాత కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

దీనివల్ల ఆయురారోగ్యాలు పెంపొందడమే కాకుండా, ఇంట్లో ఎప్పుడూ తినడానికి తిండి, తాగడానికి నీరు కొరత ఉండదని, సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల ప్రబల విశ్వాసం.

ఇది కూడా చదవండి: Eating Direction Vastu | ఈ దిశలో కూర్చుని తింటే తిరుగులేని అదృష్టం.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే!

Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!
iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం
Lebanon Children Killed | ఇజ్రాయెల్​ దాడిలో 100 మందికి పైగా చిన్నారులు మృతి.. లెబనాన్​ ప్రకటన
TAGGED:annadanamcharity in hinduismdonation practiceshindu ritualsindian culturepuja ritualsspiritual benefitsswayampaka danam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Diabetes Toothpaste Safety Diabetes Toothpaste Safety | షుగర్ పేషంట్లు తియ్యగా ఉండే పేస్ట్‌లు వాడొచ్చా? వాడితే ఏమౌతుంది?
Next Article Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం! Sunflower Seeds Beauty | సన్‌ఫ్లవర్ గింజలతో ఇలా చేస్తే.. రెట్టింపు అందం సొంతం!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?