అక్షరటుడే, వెబ్‌డెస్క్ : urea shortage warning | రాష్ట్రంలో రానున్న రోజుల్లో యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పశ్చిమాసియా యుద్ధం ఇలాగే కొనసాగితే యూరియా సమస్య వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు సహకరించి తెలంగాణలో యూరియా కొరతను ఎదుర్కొనడానికి ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు.
సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పర్యటించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసగించారు. తమ ప్రభుత్వం ఏ నియోజకవర్గంపై వివక్ష చూపదన్నారు. మిగతా నియోజకవర్గాల్లాగే సిద్దిపేటకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు అలాగే ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, హరీశ్ రావుతో తనకు రాజకీయంగా విబేధాలు ఉండొచ్చన్నారు. ఆ కారణంతో ఆ ప్రాంతాల్లోని పేదలకు అన్యాయం చేయకూడదనే తన ఉద్దేశం అన్నారు.
urea shortage warning | పంట మార్పిడిపై..
పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు చేయాలని మంత్రి తుమ్మలకు సీఎం సూచించారు. పంట మార్పిడి ద్వారా రైతులను లాభసాటిగా మార్చాలన్నారు. పామ్ ఆయిల్ (Oil Palm) సాగును ప్రోత్సాహించాలన్నారు. సిద్దిపేటలో కట్టిన ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ లాంటిదే కొడంగల్‌లో కూడా కట్టించాలని తుమ్మలను కోరారు. తాను సీఎం అయ్యాకే సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించామని తెలిపారు. కావాలంటే ఫ్యాక్టరీని కొడంగల్‌కు తరలించి ఉండొచ్చన్నారు. ఇక్కడి రైతుల సంక్షేమం కోసం ఫ్యాక్టరీ నిర్మించామని తెలిపారు. వివక్ష తమ ఇంటా వంటా లేదన్నారు.
urea shortage warning | 2029లో కాంగ్రెస్ గెలుస్తుంది
పేదల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుంది కానీ, రాజకీయ నాయకుల కోసం కాదని సీఎం స్పష్టం చేశారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. సిద్దిపేటలో గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
urea shortage warning | బీఆర్ఎస్ది మొసలి కన్నీరు
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను 98.5 శాతం రైతులు భూములు ఇచ్చాకే ప్రారంభించామని సీఎం తెలిపారు. ఏటిగడ్డ-కిష్టాపూర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల గత ప్రభుత్వం వ్యవహరించిన అందరికీ తెలుసన్నారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో పేదల పట్ల బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.
దీనిని కూడా చదవండి : TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన

