అక్షరటుడే, న్యూఢిల్లీ: March 23 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్రరూపం దాలుస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. క్రూడ్ ఆయిల్(Crude oil) ధర భారీగా పెరగడం, గ్యాస్‌కొరతలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉండటంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి.
గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండటంతో మన మార్కెట్లు కూడా భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
March 23 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 2.01 శాతం, ఎస్ అండ్ పీ 1.51 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.21 శాతం లాభంతో ఉంది.
March 23 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 2.05 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.86 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.46 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 5.23 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.55 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 2.78 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.17 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.67 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.49 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.34 శాతం నష్టంతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు కూడా భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 15వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,518 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 17వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,706 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.91 నుంచి 0.93కి పెరిగింది.
- విక్స్ 0.04 శాతం పెరిగి 22.81 వద్ద ఉంది. విక్స్ 18 పైన ఉండటం మార్కెట్‌లోని ఒడుదుడుకులను సూచిస్తోంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 93.71 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 112.19 డాలర్లకు చేరింది.

