Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం

అంతర్జాతీయం

Iran US tensions | అమెరికాకి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే దానిని శాశ్వతంగా మూసివేస్తాం

హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ట్రంప్ హెచ్చరికలకు కౌంటర్‌గా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలు, కీలక వ్యవస్థలపై దాడులు చేస్తామని ప్రకటించింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 23, 2026 9:20 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 రోజులు ago
Share
Iran US tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Iran US tensions | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన తాజా హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (Iran’s Revolutionary Guards) స్పష్టం చేసింది.

Contents
  • Iran US tensions | హర్మూజ్ జలసంధి మూతపడటంతో..
    • Iran US tensions | జ‌ల‌సంధి చుట్టూ రాజ‌కీయం..

Iran US tensions | హర్మూజ్ జలసంధి మూతపడటంతో..

కేవలం సైనిక స్థావరాలే కాకుండా, అమెరికా అనుబంధ ఐటీ వ్యవస్థలు, తాగునీటి శుద్ధి కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటం ఇప్పటికే అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ ఘాటుగా స్పందిస్తూ, తమ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని కీలక వ్యవస్థలన్నీ కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.

Iran US tensions | జ‌ల‌సంధి చుట్టూ రాజ‌కీయం..

అంతేకాకుండా, తమ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా పునర్నిర్మించే వరకు హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఒక్క చమురు ట్యాంకర్‌ను కూడా ముందుకు కదలనివ్వబోమని చెప్పడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సంక్షోభం ప్రభావం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత ఫిబ్రవరి 28 నుంచి జలసంధి మూతపడటంతో గ్లోబల్ ఇంధన సరఫరా అంతరాయం కలిగింది. ఫలితంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఇరాన్-ఇజ్రాయెల్ (Israel) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి, క్షిపణి దాడులు కొనసాగుతుండగా, లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులు కూడా మధ్యప్రాచ్యాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టుతున్నాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం, ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు (White House Officers) మిత్రదేశాలతో అత్యవసర చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికా బాంబర్ విమానాలు గస్తీని ముమ్మరం చేయడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.

ఇది కూడా చదవండి..: Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్​కు ట్రంప్ అల్టిమేటం

Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
Trump Warns Iran | దాడులు 20 రెట్లు పెరుగుతాయి.. ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​
Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు
Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ
Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం
TAGGED:Donald TrumpIran US TensionsIran's Revolutionary GuardsStrait of HormuzWhite House Officers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు March 23 Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. రోజు రోజుకి దిగి వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు
Next Article Ishan Kishan SRH Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?