అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని.. బడ్జెట్లో ఇందూరుకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
Nizamabad BJP Protest | ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యమెందుకు..
ఇందూరుకు మణిహారమైన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడుగులు ముందుకు వేయట్లేదని దినేష్ కులాచారి ప్రశ్నించారు. బడ్జెట్లో ఫ్యాక్టరీకి రూ.300 కోట్లు మంజూరు చేయలేదని అన్నారు. కొన్నేళ్లుగా జక్రాన్‌పల్లి ఎయిర్పోర్ట్ (Jakranpalli Airport) అంటూ ఊరిస్తున్నారని.. కనీసం రూ.100 కోట్లు ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. బైపాస్ రోడ్డుకు రూ.50కోట్లు మంజూరు చేయలేదన్నారు.
Nizamabad BJP Protest | పంటనష్టం రైతులకు అన్యాయం చేశారు..
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని దినేష్ కులాచారి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో మాధవ నగర్, అర్సపల్లి ఆర్వోబీలకు నిధులు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఇందూరుపై రేవంత్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు వస్తున్న ఎంతోమంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బైండోవర్ చేశారని.. అయినప్పటికీ విజయవంతంగా కార్యక్రమం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులకు గల్ఫ్ కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గల్ఫ్ కార్మికులకు రూపాయల రూ.500 కోట్లు కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ఉందని ఎద్దేవా చేశారు.
Nizamabad BJP Protest | పీసీసీ అధ్యక్షుడిగా జిల్లాకు ఒక్క రూపాయి తేలేదు..
జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇందూరుకు ఒక్కరూపాయి కూడా మంజూరు చేయించకపోవడం సిగ్గుచేటని దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Nizamabad BJP Protest | ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు..
రాష్ట్ర బడ్జెట్లో ఇందుకు ఒక్క రూపాయి రాకపోయినప్పటికీ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని దినేష్ కులాచారి ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) సుదర్శన్ రెడ్డి భూపతిరెడ్డిలో బడ్జెట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా పూర్తి చేశామని దినేష్ కులాచారి అన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Nizamabad BJP Protest | ముప్కాల్‌లో..
అక్షరటుడే, ముప్కాల్: బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బీజేపీ నాయకులను ముప్కాల్ పోలీసులు (Mupkal Police) ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి నాయకత్వంలో ముట్టడి కార్యక్రమానికి నిర్వహిస్తుండగా..బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి తదితరులను ఏఎస్సై సురేష్, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా.. ట్రాక్టర్ సీజ్

