అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Exam Paper Security | సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్ష పత్రాల బండిళ్లు తెరవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Exam Paper Security | నగరంలోని మాణిక్ భవన్లో..
జిల్లా కేంద్రంలోని మాణిక్ భవన్ (Manik Bhavan) పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నాపత్రాలను తెరిచారా? అని అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల బండిల్ సీళ్లు తెరవాలని సూచించారు.
Exam Paper Security | సీసీ ఫుటేజీల పరిశీలన..
ఈ మేరకు నిబంధనలు పాటించారా లేదా అని సీసీ ఫుటేజీల పరిశీలన ద్వారా కలెక్టర్ నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ఫోన్లతో వచ్చారా అని కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు ఆస్కారం కల్పిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.
Exam Paper Security | అప్రమత్తత అవసరం..
పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా తగిన పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు జె.శంకర్, టి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: SSC Exam Rules | ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!

