అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్తోనే కాకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) స్పష్టం చేశారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
SSC Exam Rules | విద్యార్థుల భవిష్యత్తుపై నిర్లక్ష్యం వద్దు..
ఇటీవల పదోతరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ పైవిధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.
SSC Exam Rules | అవకతవకలు జరగకుండా..
పదోతరగతి పరీక్షల (SSC Exams) నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్‌తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహశీల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా గట్టి పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు.
SSC Exam Rules | తాగునీటి సమస్యరాకుండా..
ఇదిలా ఉండగా, ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధిజలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు (Municipal Commissioners), ఎంపీడీఓలు, ఎంపీవోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలని, పైప్‌లైన్ లీకేజీల లాంటి పనులను యుద్ధప్రాతిపదికన నివారించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కుళాయి కనెక్షన్లు ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మండల స్పెషల్ ఆఫీసర్లు నిశితంగా పరిశీలించాలన్నారు. ముఖ్యంగా ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తాగునీటి సరఫరాను పర్యవేక్షణ చేయాలని సూచించారు.
SSC Exam Rules | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి సాధించేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Youth Job Promises | కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..

