Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే… రూ. 13.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే… రూ. 13.6 లక్షల కోట్ల సంపద ఆవిరి

బిజినెస్​

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే… రూ. 13.6 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే నమోదయ్యింది. సెన్సెక్స్ 1,836 పాయింట్లు, నిఫ్టీ 601 పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ. 13.6 లక్షల కోట్లు ఆవిరయ్యింది.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 4:58 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Stock Market Crash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Crash | పశ్చిమాసియాలో సంఘర్షణ నాలుగో వారం కూడా కొనసాగుతుండడమే కాకుండా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) వార్నింగ్ ఇవ్వగా.. అదే జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.

Contents
  • Stock Market Crash | భారీ నష్టాలతో ప్రారంభమై..
    • Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..
      • Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

దీంతో ముడి చమురుతోపాటు గ్యాస్ సంక్షోభం ఏర్పడుతోంది. ఇది ఇన్ల్ఫెషన్ భయాలను పెంచుతోంది. మరోవైపు రూపాయి విలువలో బలహీనత కొనసాగుతుండడం, ఎఫఐఐలు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

Stock Market Crash | భారీ నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 1,174 పాయింట్లు పతనమైంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో బుల్స్‌కు బేర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నిఫ్టీ 290 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 27 పాయింట్లు పెరిగినా తిరిగి అమ్మకాల ఒత్తిడికి గురై అక్కడినుంచి 380 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 1,836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద, నిఫ్టీ 601 పాయింట్ల నష్టంతో 22,512 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Crash | అన్ని రంగాలూ నష్టాల్లోనే..

బేర్ పట్టు కొనసాగుతుండడంతో అన్ని రంగాలూ భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 4.91 శాతం, మెటల్ ఇండెక్స్ 4.81 శాతం, రియాలిటీ 4.74 శాతం, టెలికాం 4.07 శాతం నష్టపోగా.. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.99 శాతం, మీడియా 3.97 శాతం,బ్యాంకెక్స్ 3.89 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.67 శాతం నష్టపోయాయి.

Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 635 కంపెనీలు లాభపడగా 3,798 స్టాక్స్ నష్టపోయాయి. 123 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 67 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 1,129 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 13.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 కంపెనీలు లాభాలతో, 26 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.10 శాతం, పవర్‌గ్రిడ్ 0.67 శాతం, ఇన్ఫోసిస్ 0.28 శాతం, టెక్ మహీంద్రా 0.19 శాతం లాభపడ్డాయి.

Top losers : టైటాన్ 6.24 శాతం, ట్రెంట్ 5.90 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 5.40 శాతం, బీఈఎల్ 4.85 శాతం, టాటా స్టీల్ 4.80 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి

Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
Iran Gulf Attacks | గల్ఫ్​ దేశాలపై ఇరాన్​ దాడులు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
March 14 Gold Rates | మహిళలకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Stock Market Volatility | ప్రారంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
Dalal Street Black Monday | దేశీయ మార్కెట్లలో బ్లడ్​బాత్​.. కల్లోలం సృష్టించిన క్రూడ్ ఆయిల్ ధర..
TAGGED:Domestic Stock Marketfii sellingglobal tensions impactIndian Stock Marketinvestor wealth lossmarket volatilityNifty declinesensex fallStock Market CrashStrait of HormuzUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article SSC Exam Rules SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Congress Policies Criticism Congress Policies Criticism | కాంగ్రెస్​ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తాం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?