Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయం

Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్​ విద్యుత్​ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్​ ట్రంప్​ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్​ భయపడి వెనక్కి తగ్గారని ఇరాన్​ పేర్కొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 6:47 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Trump Iran tensions

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Iran tensions | ఇరాన్​ విద్యుత్​ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్​ వ్యాఖ్యలకు ఇరాన్​ కౌంటర్​ ఇచ్చింది. భయపడి ట్రంప్​ వెనక్కి తగ్గారని సెటైర్​ వేసింది.

Contents
  • Trump Iran tensions | ఎలాంటి చర్చలు జరగలేదు
    • Trump Iran tensions | తగ్గిన ముడి చమురు ధరలు

హార్ముజ్​ జలసంధి (Strait of Hormuz)ని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్​పై పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్​ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్​ విద్యుత్​ కేంద్రాలు, మౌలిక సదుపాయలపై దాడులు చేస్తామన్నారు. దీనికి ఇరాన్​ సైతం దీటుగా స్పందించింది. తమ మౌలిక వసతులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించింది. గల్ఫ్​ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని తెలిపింది. ఈ క్రమంలో ట్రంప్​ దాడులు 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Trump Iran tensions | ఎలాంటి చర్చలు జరగలేదు

ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ స్పందించింది. విద్యుత్‌ కేంద్రాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో ఆయన వెనక్కి తగ్గారని పేర్కొంది. అఫ్గానిస్థాన్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్​తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్​ సోషల్​ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికా (America)తో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్​ తెలిపింది. తమ ప్రతికార దాడులకు ట్రంప్‌ భయపడ్డారని పేర్కొంది. అమెరికాను నమ్మలేమని స్పష్టం చేసింది.

Trump Iran tensions | తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని ట్రంప్​ ఆదేశించడంతో ముడి చమురు ధరలు (Crude Oil) 14 శాతం వరకు పడిపోయాయి. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పడంతో క్రూడ్​ ఆయిల్ ధరలు దిగి వచ్చాయి. అయితే ఎలాంటి చర్చలు లేవని ఇరాన్​ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం నార్త్ సీ క్రూడ్ ధరలు సుమారు బ్యారెల్‌కు 104.70 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర బ్యారెల్‌కు 91.41 డాలర్లకు చేరింది.

దీనిని కూడా చదవండి : Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా

Lahore US Consulate Attack | లాహోర్​లోని యూఎస్​ కాన్సులేట్ పై దాడి
US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!
Iran attack US tanker | అమెరికా ట్యాంకర్​పై ఇరాన్​ దాడి.. భారతీయుడి మృతి
TAGGED:geopoliticsHormuz StraitIranMiddle East tensionsoil pricesTrumpUS Iran conflict
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gas Cylinder Black Market | Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
Next Article QNet MLM scam QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?