అక్షరటుడే, వెబ్‌డెస్క్ : QNet MLM scam | క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanat) తెలిపారు. నగర పోలీసుల (Hyderabad Police) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ బహుళ కోట్ల రూపాయల అక్రమ మనీ సర్క్యులేషన్ పథకాన్ని ఛేదించిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వ్యాప్తంగా 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
క్యూనెట్ మోసాలపై సీసీఎస్ పోలీసులకు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో 25 బృందాలతో అధికారులు సోమవారం ఉదయం దాడులు చేశారు. హైదరాబాద్‌తో పాటు ఏపీ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. సోదాల అనంతరం వివరాలను నగర సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు.
QNet MLM scam | వలలో చిక్కుకోవద్దు
ఈ మోసపూరిత నెట్‌వర్క్ అధిక రాబడులు ఇస్తామన్న ఆశ చూపి ఐటీ ఉద్యోగులను, యువతను ఆకర్షించిందన్నారు. త్వరగా ధనవంతులు అవుతారని నమ్మించి మోసం చేసిందన్నారు. ప్రజలు ఇలాంటి వలలో చిక్కుకోవద్దదని ఆయన కోరారు. 1978 ప్రైజ్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం ప్రకారం, ఈ పథకాలను ప్రోత్సహించడం లేదా వాటిలో చేరడం శిక్షార్హమైన నేరమని చెప్పారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాడులు చేసి 32 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పలు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ల్యాప్‌టాప్‌లు, క్యూనెట్ ప్రోడక్ట్‌లు ఉన్నాయి.
Major Crackdown on QNet MLM Scam!
The SIT of Hyderabad City Police, have busted a massive multi-crore illegal money circulation scheme by Vihaan Direct Selling (QNet), arresting 32 persons across Telangana, Andhra Pradesh and Karnataka.
This fraudulent network lured IT… pic.twitter.com/4TCJu3RtJX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 23, 2026
దీనిని కూడా చదవండి : Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ

