అక్షరటుడే, వెబ్డెస్క్ : Colombia Plane Crash | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియా (Colombia)లోఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న సైనిక విమానం టేకాఫ్ సమయంలోనే కుప్పకూలింది.
ప్యూర్టో లెగుయిజామో సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు.. పెరూ సరిహద్దుకు సమీపంలో ప్ట్యూర్టో లెగుయిజామో (Leguizamo) పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన విమానం సి-130 హెర్క్యులస్గా గుర్తించారు. ఇది పెరూ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన సైనిక బలగాలకు సహాయం అందించేందుకు బయలుదేరింది.
Colombia Plane Crash | కారణాలు తెలియాల్సి ఉంది..
టేకాఫ్ అయిన కేవలం కొన్ని నిమిషాలకే, నగరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ఈ ప్రమాదంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ (Pedro Sánchez) తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 20 మంది గాయపడిన సైనికులను రక్షించి సమీప ఆసుపత్రులకు తరలించారు. మిగతా వారిని వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు క్లిష్టంగా మారినట్లు సమాచారం.
Colombia Plane Crash | మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా
ఈ ఘటనపై అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ ప్రమాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ విషాద ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ఆశిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది” అని తెలిపారు.అదే సమయంలో, సైనిక రంగంలో ఆధునీకరణ పనుల్లో జరుగుతున్న ఆలస్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఇది కూడా చదవండి..: Trump Iran tensions | ట్రంప్ వెనక్కి తగ్గారు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు

