Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!

జాతీయం

India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య ఆంక్షలు ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి తక్షణ ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పదిలంగానే ఉందని ఆర్‌బీఐ పేర్కొంటోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 11:46 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
India Economic Resilience

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Economic Resilience | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. ఇన్​ఫ్లేషన్​ భయాలు పెరుగుతున్నాయి. అన్ని దేశాలు ఇంధన సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పదిలంగానే ఉందని ఆర్‌బీఐ (RBI) పేర్కొంటోంది. విదేశీ కుదుపుల నుంచి దేశాన్ని రక్షించేందుకు మనవద్ద విదేశీ మారకపు నిల్వలు తగినన్ని ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్చి బులెటిన్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ బులెటిన్‌లో ఇచ్చిన విషయాలు ఆర్‌బీఐ అధికారిక ప్రకటన కిందకు రాకపోవడం గమనార్హం.

Contents
  • India Economic Resilience | క్రూడ్ ఆయిల్ ధర ప్రభావం..
    • India Economic Resilience | అదుపులోనే ద్రవ్యోల్బణం
      • India Economic Resilience | జీడీపీ వృద్ధి 7.6 శాతం..
        • India Economic Resilience | సరిపడా విదేశీ మారకపు నిల్వలు..

India Economic Resilience | క్రూడ్ ఆయిల్ ధర ప్రభావం..

ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఆగకుండా కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. మూడు వారాల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 78 డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచాయి. ఇన్ఫ్లెషన్ పెరిగితే వడ్డీ రేట్లను పెంచే యోచనలోనూ ఉన్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88.6 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.

India Economic Resilience | అదుపులోనే ద్రవ్యోల్బణం

రిటెయిల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) జనవరిలో 2.7 శాతంగా ఉండగా ఫిబ్రవరిలో 3.2 శాతానికి పెరిగింది. ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధనం, ఆహారం తదితరాలను మినహాయించి చూసే కోర్ ద్రవ్యోల్బణం (విలువైన ఆభరణాలు మినహాయించి) 1.9 శాతం వద్ద నిలకడగా కొనసాగుతుండడం మార్కెట్లకు ఊరటనిచ్చే అంశం. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లపైన కొనసాగితే ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

India Economic Resilience

India Economic Resilience | జీడీపీ వృద్ధి 7.6 శాతం..

నూతన ఆధార సంవత్సరం(బేస్ ఇయర్) 2022-23 ప్రకారం దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదవుతుందని అంచనా. దేశీయ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడుల కార్యకలాపాలు బలంగా ఉండడంతో మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా 7.8 శాతంగా నమోదైంది. వ్యవసాయ, తయారీ రంగాలతో పాటు సేవా రంగమూ అద్భుతమైన పనితీరు చూపించాయి. అయితే అమెరికా (America), ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు దీర్ఘ కాలం కొనసాగితే దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడి, జీడీపీ వృద్ధి సైతం మందగించే అవకాశాలున్నాయి.

India Economic Resilience | సరిపడా విదేశీ మారకపు నిల్వలు..

2024-25తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు స్వల్పంగా పెరిగింది. ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం దీనికి కారణం. కరెన్సీ కూడా ఆందోళన కలిగించేలా రోజురోజుకూ పతనమవుతోంది. మరోవైపు ఎఫ్ఐఐలు దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market) నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నారు. దీంతో మన విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి. మార్చి 13 నాటికి విదేశీ మారక నిల్వలు 709.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు సుమారు 11.2 నెలల దిగుమతులకు సరిపోతాయని ఆర్‌బీఐ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసు వ్యవస్థలు, ముడి చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి, వాణిజ్య సవాళ్లు నెలకొన్నప్పటికీ, పటిష్ఠమైన స్థూల ఆర్థిక పునాదులు, బలమైన విదేశీ మారక నిల్వల కారణంగా ఎలాంటి ఇబ్బందులకైనా ఎదురొడ్డి నిలబడే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..: India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన

IRCTC Pilgrimage Tour | ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్‌ గౌరవ్‌ రైలు
Petrol Excise Duty Cut | పెట్రోల్, డీజిల్​​పై ఎక్సైజ్​ డ్యూటీ తగ్గించిన కేంద్రం
Strait of Hormuz Closure | హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు
Iran Israel War live updates | ఇరాన్​ అధ్యక్షుడికి భారత్​ ప్రధాని ఫోన్.. యుద్ధం మొదలయ్యాక తొలిసారి పలకరింపు!​
Supreme Judgement on Religion Change | మత మార్పిళ్లపై సుప్రీం సంచలన తీర్పు
TAGGED:AmericaCrude OilDomestic Stock MarketIndia Economic ResilienceRBI
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jasprit Bumrah Injury Jasprit Bumrah Injury | ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్.. గాయంతో ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్..?
Next Article Student Snake Bite Student Snake Bite | పదో తరగతి విద్యార్థికి పాముకాటు.. భయాందోళనలో విద్యార్థులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?