Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు

బిజినెస్​తాజా వార్తలు

Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు

పశ్చిమాసియలో ఉద్రిక్తతలు తగ్గుతాయన్న సూచనలతో దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,372 పాయింట్లు, నిఫ్టీ 399 పాయింట్లు పెరిగాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 4:24 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Stock Market Surge

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  Stock Market Surge | యుద్ధం విరమించే విషయంలో ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నందున ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రణాళికబద్ధమైన దాడులను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌లకు కాస్త ఊరటనిచ్చింది.

Contents
  • Stock Market Surge | భారీ లాభాలతో ప్రారంభమై..
    • Stock Market Surge | అన్ని రంగాలూ లాభాల్లోనే..
      • Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

అమెరికాతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావడానికి ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) అంగీకరించారన్న అల్ అరేబియా రిపోర్ట్ దీనికి తోడయ్యింది. రూపాయి విలువ కాస్త బలపడడం, క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలిచారు. అయితే దీనిని ఇరాన్ ధ్రువీకరించకపోవడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి.

Stock Market Surge | భారీ లాభాలతో ప్రారంభమై..

మంగళవారం ఉదయం సెన్సెక్స్ 1,516 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ప్రారంభంలోనే 1,128 పాయింట్లు పడిపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 1,405 పాయింట్లు పైకి వచ్చింది. నిఫ్టీ 366 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 21 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 275 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతుతో కోలుకుని 433 పాయింట్లు పెరిగింది. చివరికి సెన్సెక్స్ 1,372 పాయింట్ల లాభంతో 74,068 వద్ద, నిఫ్టీ 399 పాయింట్ల నష్టంతో 22,912 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Surge | అన్ని రంగాలూ లాభాల్లోనే..

అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ (Nifty) మీడియా ఇండెక్స్ 3.45 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 2.46 శాతం, ఆటో 2.43 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.34 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.27 శాతం, టెలికాం 1.94 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.90 శాతం, ఐటీ ఇండెక్స్ 1.72 శాతం పెరిగాయి.

Stock Market Surge | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,968 కంపెనీలు లాభపడగా 1,295 స్టాక్స్ నష్టపోయాయి. 168 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 44 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 557 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎసఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 8.25 లక్షల కోట్ల మేర పెరిగింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో, 2 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎల్‌టీ 5.19 శాతం, ఇండిగో 5.18 శాతం, ఎటర్నల్ 4.85 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.69 శాతం, ఆసియన్ పెయింట్ 4.54 శాతం లాభపడ్డాయి.

Losers : పవర్‌గ్రిడ్ 0.81 శాతం, ఎన్‌బీఐ 0.09 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: March 24 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Today Horoscope | గుండెలను కొల్లగొట్టే అయస్కాంతతత్వం ఈ రాశుల వారికే సొంతం!
Gym Heart Attack Death | జిమ్​ చేస్తూ హార్ట్​ ఎటాక్​తో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి మృతి
Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
TAGGED:equity market updateFinancial NewsIndia stock marketinvestor sentimentmarket news indiaMojtaba KhameneiNiftyNifty gainsSensex rallyUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article School Early Admissions School Early Admissions | ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
Next Article Bodhan Government Hospital Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?