Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Heatwave Awareness Nizamabad | వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 6:03 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Heatwave Awareness Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Heatwave Awareness Nizamabad | వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Contents
  • Heatwave Awareness Nizamabad | టాస్క్​ఫోర్స్​ కమిటీ సైతం ఏర్పాటు..
    • Heatwave Awareness Nizamabad | అన్నిశాఖలు అప్రమత్తంగా..
      • Heatwave Awareness Nizamabad | వడదెబ్బ నివారణకు..

Heatwave Awareness Nizamabad | టాస్క్​ఫోర్స్​ కమిటీ సైతం ఏర్పాటు..

కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ (Task Force Committee)ని సైతం ఏర్పాటు చేసినట్లు ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈసారి వేసవి సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వేసవిలో కార్మికులు, ప్రజలు భారీ ఉష్ణోగ్రతల వల్ల వడగాడ్పులకు లోనై ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లేబర్ అడ్డాలు, పని ప్రదేశాలను గుర్తించి తాగునీరు అందుబాటులో ఉంచాలని, అన్ని బస్తీ దవాఖానాలు, పీహెచ్​సీ, సీహెచ్​సీల్లో రెట్టింపు స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉండేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

Heatwave Awareness Nizamabad | అన్నిశాఖలు అప్రమత్తంగా..

వైద్య ఆరోగ్య, ఉపాధి హామీ, పర్యావరణ, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు వడదెబ్బ నివారణపై కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్​ (Collector Ila Tripathi) సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రం, అంగన్​వాడీ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. గురుకులాలు, వసతి గృహాలలో ఎండ తీవ్రతపై అవగాహన కల్పించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని సూచించారు.

Heatwave Awareness Nizamabad | వడదెబ్బ నివారణకు..

వడదెబ్బ (Heatstroke)నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందింపజేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీని కలెక్టర్​ ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు వారు పనిచేసే ప్రదేశాల్లో నీడను అందించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని, కూలీలు తప్పనిసరిగా తమ వెంట తాగునీటిని తెచ్చుకునేలా చూడాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వడదెబ్బతో ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యాల బారిన పడకుండా అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు.

ఇది కూడా చదవండి..: Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య

Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
Six Guarantees Budget | బడ్జెడ్​లో ఆరు గ్యారెంటీలకు నిధులు శూన్యం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
TAGGED:Collector Ila TripathiDistrict administration newsHeatstrokeheatstroke preventionHeatwave Awareness NizamabadIla Tripathi instructionsORS availabilitypublic health alertsummer precaution measuressummer safety TelanganaTask Force Committee
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Modi Revanth Reddy Criticism Modi Revanth Reddy Criticism | ప్రజలను మోసం చేస్తున్న మోదీ, రేవంత్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
Next Article Kamareddy Heavy Rain | Kamareddy Heavy Rain | కామారెడ్డిలో భారీ వర్షం
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: BLO Absence Issue | బీఆల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?