అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hormuz LPG ships | హార్ముజ్ జలసంధిని రెండు భారత నౌకలు దాటాయి. ఎల్పీజీ (LPG) లోడ్‌తో వస్తున్న ఆ షిప్‌లతో దేశంలో కొంతమేర గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇరాన్ (Iran) హార్ముజ్ జలసంధిని మూసి వేసిన విషయం తెలిసిందే. దీంతో 20కి పైగా భారత నౌకలు (Indian Ships) అక్కడ చిక్కుకుపోయాయి. ప్రధాని మోదీ (Prime Minister Modi), విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అధికారులు ఇరాన్‌తో చర్చలు జరిపారు. దీంతో పలు నౌకలను ఇరాన్ అనుమతిస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ఎల్పీజీ నౌకలు భారత్‌కు చేరుకోగా.. తాజాగా రెండు నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి.
Hormuz LPG ships | 96 వేల టన్నుల గ్యాస్‌తో..
ఈనెల 26న జంగ్ వసంత్ అనే నౌక భారత్‌కు చేరుకోనుంది. 27న పైన్ గ్యాస్ షిప్ రానుంది. ఈ నౌకల్లో 92,612 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉందని ప్రభుత్వం తెలిపింది. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా, అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో మాట్లాడుతూ 45 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్న పైన్ గ్యాస్ నౌక మార్చి 27న న్యూ మంగళూరు ఓడరేవుకు చేరుకుంటుందని తెలిపారు. 47,600 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో జగ్ వసంత్ మార్చి 26న కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందన్నారు. కాగా మరో 20 నౌకలు హార్ముజ్ వద్ద ఉన్నాయి.
Hormuz LPG ships | కువైట్ నుంచి..
జగ్ వసంత్ నౌక కువైట్ నుంచి ఎల్‌పీజీని లోడ్ చేసుకోగా, పైన్ గ్యాస్ యూఏఈలోని రువైస్ నుంచి సరుకును తీసుకొని బయలు దేరింది. ఈ నెల ప్రారంభంలో భారత జెండా కలిగిన రెండు నౌకలు హార్ముజ్‌ను దాటి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాయి.
ఇది కూడా చదవండి..: Modi Preparedness Warning | దేశ ప్రజలు సవాళ్లకు సిద్ధంగా ఉండాలి.. మోదీ సంచలన వ్యాఖ్యలు

