అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Trump Call | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు.
ట్రంప్ తనకు ఫోన్ చేసినట్లు ప్రధాని మోదీ (PM Modi) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పశ్చిమ ఆసియాలోని పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించి, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి భారతదేశం మద్దతు ఇస్తుందన్నారు. అలాగే ప్రపంచం మొత్తానికి అత్యంత అవసరమైన హర్ముజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
Modi Trump Call | ఉద్రిక్తతలను తగ్గించడం కోసం..
అమెరికా-ఇరాన్ (America -Iran) మధ్య ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రపంచ నౌకా రవాణా మార్గాలను పరిరక్షించడంపై ఇద్దరు నేతలు దృష్టి సారించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. ఇరాన్‌పై సైనిక దాడులకు ట్రంప్ ఇటీవల 5 రోజుల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ సైతం చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ట్రంప్ మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో దీనిని తెరవాలని భారత్ కోరుతోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలను కోరుతోంది. ఈ క్రమంలో ట్రంప్, మోదీ ఫోన్ (Modi Trump Call )లో చర్చలు జరపడం గమనార్హం.
Received a call from President Trump and had a useful exchange of views on the situation in West Asia. India supports de-escalation and restoration of peace at the earliest. Ensuring that the Strait of Hormuz remains open, secure and accessible is essential for the whole world.…
— Narendra Modi (@narendramodi) March 24, 2026
దీనిని కూడా చదవండి : Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి

