Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!

జాతీయంతాజా వార్తలు

LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!

తాజా గ్యాస్​ బుకింగ్​ నియమాలు తాత్కాలిక అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

Naresh chandan
Last updated: మార్చి 25, 2026 9:42 ఉద.
Naresh chandan
2 రోజులు ago
Share
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!

అక్షరటుడే, న్యూఢిల్లీ: LPG Booking Rules | దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ (LPG) సిలిండర్‌ బుకింగ్‌ నిబంధనలు కఠినతరం అయ్యాయి. సరఫరాలో ఆలస్యం, పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. ఈ మార్పులు వినియోగదారులపై తీవ్రంగానే ప్రభావం చూపనున్నాయి.

Contents
  • LPG Booking Rules | కొత్త బుకింగ్‌ నిబంధనలు
    • LPG Booking Rules | ఎందుకింత కఠిన నిర్ణయం?
      • సరఫరా సమతుల్యం..
      • వినియోగదారులు పాటించాల్సిన సూచనలు

LPG Booking Rules | కొత్త బుకింగ్‌ నిబంధనలు

తాజా మార్గదర్శకాలు ఇలా..

  • డబుల్‌ సిలిండర్‌ ఉన్నవారు 35 రోజుల గ్యాప్​తో రీఫిల్‌ బుకింగ్‌ చేసుకోవాలి.
  • ఉజ్వల కనెక్షన్‌ ఉన్నవారికి 45 రోజుల తర్వాతే బుకింగ్​కు అవకాశం.
  • సింగిల్‌ సిలిండర్‌ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • నిర్దేశిత గడువు కంటే ఒక్కరోజు ముందు బుక్‌ చేసుకున్నా.. సదరు బుకింగ్‌ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.

LPG Booking Rules | ఎందుకింత కఠిన నిర్ణయం?

దేశంలో ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, అంతర్జాతీయ మార్కెట్లో సరఫరాతోపాటు ఇంధన ధరల మార్పులు, రవాణా సమస్యల వంటి కారణాలు LPG వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల మార్పునకు ప్రధాన కారణం అయ్యాయి.

మరోవైపు, కొందరు వినియోగదారులు అవసరానికి మించి సిలిండర్లు బుక్‌ చేసుకోవడం కూడా సమస్యగా పరిణమించింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఒక్కో గ్యాస్​ ఏజెన్సీలో సాధారణంగా రోజుకు 300–400 బుకింగ్స్​ ఉండేవి.. 2000 ల వరకు పెరిగాయి. దీనివల్ల నిజంగా గ్యాస్​ అవసరమైన వారికి ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు బుకింగ్‌ వ్యవస్థను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరఫరా సమతుల్యం..

ప్రతి వినియోగదారునికి నిర్ణీత సమయంలో గ్యాస్ అందేలా చూడటం, నిల్వలు సమతుల్యం చేయడం, దుర్వినియోగాన్ని నియంత్రించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

వినియోగదారులు పాటించాల్సిన సూచనలు

గ్యాస్ అవసరాన్ని ముందుగానే అంచనా వేసుకుని బుకింగ్‌ చేయాలి. చివరి నిమిషంలో బుకింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే సమస్యలు తప్పవు.

ఇది కూడా చదవండి: LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!

ఇది కూడా చదవండి: LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!

Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
LPG Supply Update | గ్యాస్​ కొరత లేదు.. 10 శాతం​ ఉత్పత్తి పెరిగింది..: కేంద్ర ప్రభుత్వ వర్గాలు
KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Tamil Nadu NDA seats | తమిళనాడు ఎన్నికలు.. ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు
TAGGED:cylinder rules indiafuel supply issuesGas Cylinder Bookingindia gas newslpg booking ruleslpg refill policylpg updateujjwala scheme
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల సంబరాలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన march 25 Gold Rates | గోల్డ్​ ప్రియుల్లో ఆనందం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Next Article RCB Sale Deal RCB Sale Deal | ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద డీల్.. భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Petrol Shortage Rumors | బారులు తీరిన వాహనదారులు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?