అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Iran Peace Plan | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారానికి చేరుకున్న నేపథ్యంలో పరిణామాలు కీలక మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కఠిన వైఖరి అవలంబించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా దౌత్యపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో ఇరాన్‌కు శాంతి ప్రణాళికను పంపినట్లు మంగళవారం ప్రకటించారు. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా శత్రు నౌకలను అనుమతించబోమని టెహ్రాన్ మరోసారి స్పష్టం చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Trump Iran Peace Plan | 15 అంశాల శాంతి ప్రణాళిక – కీలక ప్రతిపాదనలు:
అమెరికా రూపొందించిన 15 పాయింట్ల శాంతి ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు పంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా:
నెల రోజుల కాల్పుల విరమణ
ఈ కాలంలో ఇరు దేశాల మధ్య చర్చలు
ఇరాన్ యురేనియం సుసంపన్నత (enrichment) నిలిపివేయడం
ఇప్పటికే సుసంపన్నం చేసిన యురేనియాన్ని అప్పగించడం
అణు కార్యక్రమాలపై పరిమితులు విధించడం
అలాగే నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలను మూసివేయడం కూడా చర్చల్లో భాగంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఒప్పందానికి అంగీకరిస్తే, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేయనుంది. అలాగే బుషెహర్లో సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ అభివృద్ధికి సహాయం అందించే అవకాశముంది. అదేవిధంగా హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు ఇరాన్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది.ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందించడం నిలిపివేయడం, క్షిపణుల సంఖ్య, పరిధి, వినియోగంపై పరిమితులు విధించడం వంటి అంశాలు కూడా చర్చల్లో చోటు చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి..: Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి

