అక్షరటుడే, వెబ్డెస్క్: Indigo Emergency Landing | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం (IndiGo Flight) ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బుధవారం ఉదయం 63 మంది ప్రయాణికులతో జగదల్పూర్కు ఫ్లైట్ బయలు దేరింది.
జగదల్పూర్కు వెళ్లిన తర్వాత వాతావరణం అనుకూలించలేదు. దీంతో అక్కడ విమానం ల్యాండ్ కాలేదు. తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad Airport)కు వచ్చింది. అనంతరం పైలెట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జగదల్పూర్లో దిగుతామనుకుంటే.. మళ్లీ శంషాబాద్కే రావడంతో షాక్ అయ్యారు.
Indigo Emergency Landing | విజయవాడలో..
విజయవాడ (Vijayawada)లో మంగళవారం సాయంత్రం ఇండిగో విమానం టైర్ పేలింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఇండిగో విమానం (IGO4HJ), ఒక టైరు పేలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సాయంత్రం 4:20 గంటల సమయంలో ల్యాండింగ్ తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆ సమయంలో విమానంలో 75 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్… హైదరాబాద్లో వాహనదారుల ఇక్కట్లు!

