Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్

హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద సంబంధాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో బయటపడ్డ కేసుతో సంబంధం ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోగా, దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 11:35 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Hyderabad Terror Links

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Terror Links | తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad)లో ఉగ్రవాద లింకులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు అనుమానంతో సయిదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్, ఇటీవల విజయవాడలో బయటపడిన ఉగ్రలింకుల కేసుతో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Contents
  • Hyderabad Terror Links | నగరంలో గాలింపు చర్యలు
    • Hyderabad Terror Links | దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్

Hyderabad Terror Links | నగరంలో గాలింపు చర్యలు

ఇంతకుముందు విజయవాడ (Vijayawada)లో మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నగరంలో గాలింపు చర్యలు చేపట్టి సయిదా బేగంను పట్టుకున్నారు. ఆమెను స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విచారించి, మరింత దర్యాప్తు కోసం విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Hyderabad Terror Links | దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఉగ్రలింకుల నెట్‌వర్క్ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్ , మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. సుమారు 12 మంది సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా గుప్తంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో “అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్” పేరుతో గ్రూప్‌ను నిర్వహిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. గతంలో గుజరాత్ ATS అరెస్టుల తర్వాత ఈ నెట్‌వర్క్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారులు ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నిస్తూ మిగతా సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముఖ్య నగరాల్లో నిఘా పెంచడంతో పాటు, అనుమానాస్పద సోషల్ మీడియా (Social Media) అకౌంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో ఈ కేసును పరిశీలిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​

Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం!
Oppo K14 5G | భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి మరో ఫోన్.. మార్చి 9న లాంచ్ కానున్న కే14 మోడల్
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Iran Israel War UPDATES | మోజ్తాబా ఎన్నిక.. ఇరాన్​ యుద్ధంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
TAGGED:HyderabadHyderabad Terror LinksInstagramVijayawada
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Lambadi Protest Arrests Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..
Next Article KTR ACB Chargesheet KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?