అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Okha Tirupati Express | తిరుపతి (Tirupati) నుంచి ఓఖా మధ్య నడిచే ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు క్రమబద్ధీకరించారు. క్రమబద్ధీకరించిన రైలు నంబర్‌ను 19559/60 గా మార్చారు.
మదురై నుంచి ఓఖా మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ (Special Weekly Express) రైలుగా నడుస్తుంది. ఈ రైలు సంఖ్య 09520/19. అయితే తాజాగా దీనిని క్రమబద్దీకరించారు. దీని ముగింపు స్టేషన్‌ను మధురై నుంచి తిరుపతికి మార్చారు. దీంతో ఇక నుంచి ఈ రైలు ఓఖా–తిరుపతి మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రైలు అకోలా – పూర్ణా – నాందేడ్ – నిజామాబాద్ – కామారెడ్డి – కాచిగూడ – మహబూబ్ నగర్ – కర్నూలు సిటీ – ద్రోణాచలం – గుత్తి – కడప – ఎర్రగుంట్ల మీదుగా నడుస్తుంది. ఇప్పటికే ఇదే మార్గంలో వారానికి ఒక రోజు చొప్పున ఓఖా నుంచి రామేశ్వరం ఎక్స్ ప్రెస్ రైలు (16734/33) నడుస్తుంది.
Okha Tirupati Express | ఈ స్టేషన్లలో ఆగుతుంది
ఓఖా–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికి ఒకసారి ఉంటుంది. ప్రతి సోమవారం గుజరాత్‌లోని ఓఖా నుంచి బయలు దేరి మంగళవారం తిరుపతి చేరుకుంటుంది. మంగళవారం తిరుపతి నుంచి ఓఖాకు బయలు దేరుతుంది. ద్వారాకా, కాంబాలియ, జామ్‌నగర్, హపా, రాజ్‌కోట్ సహా మొత్తం 38 స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్, తాడిపత్రి, కడప, రాజంపేట్, రేణిగుంట ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: LPG Booking Rules | సిలిండర్ బుకింగ్ రూల్స్ మరింత కఠినతరం!

