Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

అంతర్జాతీయం

Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. ఆ దేశ కరెన్సీ రోజురోజుకు భారీగా పతనం అవుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 25, 2026 1:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Iran Currency Collapse

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Currency Collapse | అణు కార్యక్రమం విషయంలో అమెరికా (America)తో ఏర్పడిన విభేదాలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయి. అగ్రరాజ్యం ఎడాపెడా ఆంక్షలు విధించడంతో ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. గతనెల 28న ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది.

Contents
  • Iran Currency Collapse | ఆంక్షలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
    • Iran Currency Collapse | కరెన్సీ నిల్వలు లేక ఇక్కట్లు..

ఆ దేశ కరెన్సీ రియాల్ (Currency Rial) విలువ ఎంతగా పడిపోయిందంటే తాజాగా విడుదల చేసిన 10 మిలియన్ల రియాల్ నోటు విలువ ఏడున్నర డాలర్లు. భారత కరెన్సీలో ఈ నోటు విలువ రూ. 713 కావడం గమనార్హం. అంటే ఒక భారత రూపాయి విలువ 14,017 రియాల్స్‌కు సమానం అన్నమాట.

Iran Currency Collapse | ఆంక్షలతో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ

యుద్ధ భయాలతోపాటు అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్ (Iran) బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చాయి. దీంతో ఆ దేశం తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి పడిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్ 2025లో 64 శాతం ఉండగా, ఫిబ్రవరి 2026 నాటికి అది ఏకంగా 105 శాతానికి పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు చిన్న వస్తువులు కొనాలన్నా సంచుల కొద్దీ నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులను తగ్గించడానికి ఇరాన్ ప్రభుత్వం (Iranian Government) కొత్త నోట్లను ముద్రిస్తోంది. తాజాగా 10 మిలియన్ రియాల్ నోటును తీసుకువచ్చింది. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధిక విలువ కలిగిన నోటు. ఆ దేశంలో దీని విలువ 10 మిలియన్లు అయినా.. మారకం విలువ 7.5 డాలర్లు కావడం గమనార్హం. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగా బలహీనపడిందో స్పష్టం చేస్తోంది.

Iran Currency Collapse | కరెన్సీ నిల్వలు లేక ఇక్కట్లు..

ఇరాన్ దేశంలోని ప్రధాన బ్యాంకులు మొండి బకాయిలతో మూతపడ్డాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఒక రకమైన ‘పాంజీ స్కీమ్’ (Ponzi Scheme) లా మారిందని, వాస్తవ ఆస్తులు లేకుండా కేవలం కాగితపు లాభాలను చూపిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బ్యాంకులపై నమ్మకం పోవడంతో ప్రజలు నగదును ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు, ఇది మార్కెట్‌లో మరింత అస్థిరతకు కారణమవుతోంది. బ్యాంకుల వద్ద నోట్ల నిల్వలు లేని కారణంగా ప్రజలు ఏటీఎంల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి రోజుకు 30 డాలర్లలోపు మాత్రమే విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Modi Trump Call | ప్రధాని మోదీకి ట్రంప్​ ఫోన్​.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చ

Trump Iran tensions | ట్రంప్‌ వెనక్కి తగ్గారు.. ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
North Korea Missile Launch | బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..
US Immigration Offer | అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌.. దేశం వీడితే 2,600 డాలర్లు..
Iran Amazon Data Center | అమెజాన్​ డేటా సెంటర్​పై ఇరాన్​ దాడి
Iran Qatar Missile Attack | ఖతార్​పై ఇరాన్​ 66 క్షిపణులు, 114 ష్రాప్నెల్స్​ ప్రయోగం!
TAGGED:currency devaluationCurrency Rialeconomic sanctions iranfinancial crisisglobal inflationiran currency collapseiran economy crisisIranian Governmentmiddle east economyrial value fall
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేసిన జీవన్​రెడ్డి.. రేవంత్​రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
Next Article Petrol Shortage Petrol Shortage | పెట్రోల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: ఎస్పీ రాజేష్​ చంద్ర
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Padma River Bus Accident | నదిలో బస్సు పడి 23 మంది మృతి

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?