అక్షరటుడే, కామారెడ్డి: Petrol Shortage | జిల్లాలో పెట్రోల్ కొరత లేదని, కొరత ఉందని అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
Petrol Shortage | బంక్‌లు మూసివేస్తారనే ప్రచారం అవాస్తవం..
బుధవారం ఉదయం నుంచి పెట్రోల్ కొరత ఉందని, బంకులు మూసివేస్తారని జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ స్పందించారు. జిల్లాలో అన్ని పెట్రోల్ బంకులలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై బంకుల వద్దకు చేరుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు (Traffic Problems) తలెత్తుతాయని, సాధారణ పంపిణీకి ఇబ్బందులు ఎదురవుతుందన్నారు. సోషల్ మీడియాలో (Social Media) వస్తున్న వదంతులను నమ్మి ఫుల్ ట్యాంక్ నింపడానికి, నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవద్దన్నారు. దానివల్ల అత్యవసరంమైన వారికి ఇబ్బందులు కలుగుతాయన్నారు. ప్రజలు అనవసర ప్రచారాన్ని నమ్మి వదంతులను షేర్ చేయవద్దని కోరారు.
ఇది కూడా చదవండి..: Lambadi Protest Arrests | అరెస్ట్‌లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..

