అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Rashmika honeymoon | తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్డ్ కపుల్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా రీసెంట్‌గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలు దాదాపు వారం రోజుల పాటు ఘనంగా సాగాయి.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వివాహం తర్వాత మార్చి 4న సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. పెళ్లి అనంతరం ఈ జంట థాయ్‌లాండ్ (Thailand)కు హనీమూన్ ట్రిప్ వెళ్లింది. ముఖ్యంగా కోహ్ సముయ్ ద్వీపంలోని సముద్ర తీరాన ఉన్న ఓ ప్రైవేట్ విల్లాలో వీరు తమ ప్రత్యేక సమయాన్ని గడుపుతున్నారు.
Vijay Rashmika honeymoon | కూల్ వెదర్‌లో..
ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం, సముద్రపు అలల మధ్య ఈ జంట ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఎయిర్ బిన్బి విల్లాలో ఈ జంట సరదా క్షణాలు గడుపుతుంది. పెళ్లి వేడుకల తర్వాత మేము ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాము.ఇక్కడ ఉదయం చాలా నిశ్శబ్ధంగా సాయంత్రాలు టేబుల్ టెన్నిస్,స్విమ్మింగ్, పూల్‌గేమ్స్ తో గడిచిపోతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి మూవీ నైట్స్ (Movie Nights) ఎంజాయ్ చేస్తున్న ఈ జంటని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
Vijay Rashmika honeymoon | రష్మిక త్వరలో ‘రణబాలి’ చిత్రం
ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ కెరీర్‌ను బిజీగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి రణబాలి (Ranabali) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించి మంచి కెమిస్ట్రీని చూపించిన ఈ జంట, మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.రష్మిక వివాహం తర్వాత ‘మైసా’ షూటింగ్ ప్రారంభించింది. దీనితో పాటు విజయ్, రష్మిక త్వరలో ‘రణబాలి’ చిత్రంలో కలిసి కనిపించనున్నారు. ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!

