అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో (indiramma houses) కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత అనేది చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Mla KVR) ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.
Indiramma Houses Role | ‘డబుల్’ ఇళ్లు అధ్వానం..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తాను గత రెండు సెషన్లలో రెండు ప్రశ్నలు అడిగానని కేవీఆర్ అన్నారు. అందులో ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో (double bedroom houses) వసతులు కల్పిస్తామన్నారని తెలిపారన్నారు. అయితే డబుల్ ఇళ్లు బీటలు వారాయని, అద్దాలు పగిలిపోయాయని, అసాంఘిక కార్యకలాపాలకు(telangana politics) అడ్డాగా మారుతున్నాయని వివరించారు. ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. ప్రస్తుతం ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో త్వరగా పనులు పూర్తి అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. ప్రస్తుతం డబుల్ ఇళ్ల స్థానంలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ కొనసాగుతున్నాయని తెలిపారు.
Indiramma Houses Role | ఇష్టం వచ్చినట్లుగా కేటాయించారు..
గతంలో తెలిసిన వాళ్లని, అనుచరులు అని ఇష్టం వచ్చినట్టు ఇళ్లకు కేటాయించారని, ప్రస్తుతం అలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు (housing scheme india) వేస్తే తాను కమిటీల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. కమిటీ నిర్ణయాల మేరకే పనులు జరుగుతున్నాయన్నారు. అయితే ప్రస్తుతం కొందరు తాము ఉన్న పొజిషన్ చెప్పుకుంటూ, అధికారంలో ఉన్నామని, తమకే ఇవ్వాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలచ్చి వారికి మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా..
అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వాలని వెంకటరమణా రెడ్డి కోరారు. మా వాళ్లు, మీ వాళ్లు అని ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించాలన్నారు. గత సెషన్లో ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర (government schemes) ఎంత అని అడిగితే ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కమిటీలలో (assembly news) సర్పంచ్ ఛైర్మన్గా ఉన్నారని తాను అనుకుంటున్నానని తెలిపారు. అయితే గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పలువురు సర్పంచులు ఈ అంశంపై సర్పంచులకు కమిటీకి సంబంధం లేదని అంటున్నారని తన దృష్టికి తెచ్చారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

