అక్షరటుడే, కామారెడ్డి: ABVP Leaders Arrest | ఫీజు రీయింబర్స్మెంట్ (fee reimbursement protes) విడుదల చేయడంలో ప్రభుత్వం మొద్దునిద్ర (kamareddy protest news) వీడటం లేదని ఏబీవీపీ నాయకులు (abvp student leaders) ఆరోపించారు. ఈ మేరకకు ఆదివారం రాత్రి కలెక్టరేట్లో బస చేయడానికి ప్రయత్నించారు. కలెక్టరేట్ (Collectorate protest kamareddy) గేటు మూసివేసి ఉండటంతో గేటు ముందు రహదారి పక్కన పడుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ABVP Leaders Arrest | సముదాయించే ప్రయత్నం చేసిన పోలీసులు
విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రామన్, ఎస్సై భువనేశ్వర్ పోలీస్ సిబ్బందితో కలెక్టరేట్ వద్దకు చేరుకుని నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రమాదం ఉంటుందని, పాములు తిరిగే ప్రదేశంలో ఇలా చేయడం సరికాదని సీఐ వారించారు. ఉదయం వచ్చి ధర్నా చేసుకోవచ్చని సూచించినా నాయకులు వినకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, 2014 నుంచి ఇప్పటివరకు సరైన సమయంలో స్కాలర్షిప్ రాక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు.
ABVP Leaders Arrest | సీఎం వద్దే విద్యాశాఖ ఎందుకు..?
ఇప్పుడున్న మంత్రులలో ఎవరు చదువుకున్న వాళ్లు లేరా..? సీఎం దగ్గర దగ్గర విద్యాశాఖ ఎందుకు (student scholarship issue) పెట్టుకున్నారని ఏబీవీపీ నాయకులు ప్రశ్నించారు. విద్యాశాఖలో నెలకొన్న సమస్యలపై సీఎం ఏనాడైనా మాట్లాడారా.. అని నిలదీశారు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో (telangana student politics) చనిపోతే సీఎం మాట్లాడటం లేదన్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డి.. ఖబడ్ధార్.. ఇవాళ కామారెడ్డిలో రాత్రి నిద్ర చేపట్టాం.. రేపు సీఎంను బయటకు లాక్కోస్తామ’ని హెచ్చరించారు. కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఏనాడైనా విద్యార్థుల సమస్యల మీద మాట్లాడారా.. అని ప్రశ్నించారు.
షబ్బీర్అలీని కామారెడ్డి రానివ్వం..
కామారెడ్డిలో 25 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికోసం పాలిటెక్నిక్, (telangana education protest)ఇతర కళాశాలల కోసం ప్రశ్నించారా అని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రూ.8వేల కోట్లు ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలు రేవంత్ రెడ్డి వస్తే రూ.4 వేల కోట్లకు తగ్గుతుందనుకుంటే మరొక వెయ్యి కోట్లు పెరిగిందన్నారు. స్కాలర్ షిప్ రాక క్యాటరింగ్కు విద్యార్థులు వెళ్లే పరిస్థితి నెలకొందని, అలా వచ్చిన డబ్బుతో కళాశాలల్లో సర్టిఫికెట్లు తీసుకుంటున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై షబ్బీర్ అలీ మాట్లాడకపోతే కామారెడ్డికి రానివ్వమని హెచ్చరించారు.

