అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Bribery Case | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుసగా దాడులు చేస్తూ.. అవినీతిపరుల ఆట కట్టిస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. తాజాగా ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ ఫారెస్ట్ రేంజ్ (Boath FRO) కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఎఫ్ఆర్వో టి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ ఎస్ పరశురామ్ లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ACB Bribery Case | బిల్లు చెల్లించడానికి..
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (MGNREGS) పథకం కింద హరిత హారం ప్రాజెక్ట్ కోసం ఓ వ్యక్తి నీటిని సరఫరా చేశాడు. ఆ బిల్లులకు సంబంధించి రూ.5,09,000/- చెక్కును క్లియర్ చేయించినందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణయ్ రూ.15 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు గురువారం ఎఫ్ఆర్వో తన కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి జూనియర్ అసిస్టెంట్ పరశురామ్ ద్వారా లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ACB Bribery Case | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణను వాట్సాప్ (9440446106), వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
