అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Corruption Arrest | జగిత్యాల జిల్లాలో ఏసీబీ (ACB) అధికారులు సోదాలుచేశారు. కరీంనగర్ (Karimnagar) అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును అరెస్ట్ చేశారు. అతడి వద్ద పెద్ద ఎత్తున నగలు, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీఐకి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా వ్యవహరించగా.. అతడిని సైతం అరెస్ట్ చేశారు.
కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాము, జగిత్యాల (Jagtial) జిల్లా మాల్యాల మండలం ఓబులాపూర్ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు (SGT) జక్కని వేణును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశరు. రాము వేములవాడ (Vemulavada) ఎస్‌హెచ్‌వోగా పని చేసిన సమయంలో తన మాజీ సహోద్యోగి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన వేణు ద్వారా లంచాలు తీసుకున్నాడు. 2022 నుంచి 2024 వరకు యూపీఐ లావాదేవీల ద్వారా ఒక బెల్లం వ్యాపారి నుండి క్రమం తప్పకుండా మామూళ్లు స్వీకరించారు. బెల్లం వ్యాపారి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి డబ్బులు పంపించగా.. అతడు సీఐ, అతడి తండ్రి ఖాతాలకు బదిలీ చేసేవాడు.
ACB Corruption Arrest | రూ.20 లక్షలు స్వాధీనం
ఏసీబీ అధికారులు అక్రమ లావాదేవీలను గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సీఐ బినామీగా గుర్తించారు. సీఐ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
ACB Corruption Arrest | రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
వికారాబాద్ (Vikarabad) జిల్లా పెద్దెముల్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న శ్రీ గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఫిర్యాదిదారుడి నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. భూమి పంచనామా చేసి నివేదిక అందించడానికి ఆర్ఐ లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం

