Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్​ అసిస్టెంట్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్​ అసిస్టెంట్​

తెలంగాణ

ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్​ అసిస్టెంట్​

లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మరో కేసులో సీనియర్​ అసిస్టెంట్​, జూనియర్​ అసిస్టెంట్​ రెడ్​ హ్యాండెడ్​గా దొరికారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 9:00 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
ACB corruption arrests

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB corruption arrests | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. తమ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీ (ACB) దాడులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. లంచం తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారు. తాజాగా ఓ ఏఎస్సైతో పాటు జూనియర్​ అసిస్టెంట్​ లంచం తీసుకుంటూ దొరికారు.

మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ASI) పూసాల బాలయ్యను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై ఉన్న క్రిమినల్ కేసులో సెక్షన్‌ను మార్చడానికి, దాన్ని లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ఏఎస్సై రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అధికారులు వల పన్ని పట్టుకున్నారు.

ACB corruption arrests | రిటైర్మెంట్ బెనిఫిట్స్​ కోసం..

అవినీతి అధికారులు ఉద్యోగులను కూడా వదలడం లేదు. ఓ విశ్రాంత ఉద్యోగికి రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ చెల్లించడానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ లంచం డిమాండ్​ చేశాడు. అదే సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ తరఫున ఈ మొత్తాన్ని రమేశ్ వసూలు చేశాడు. పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపినందుకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను ప్రాసెస్​ చేయడానికి రూ.13 వేలు అడిగాడు. దీంతో బాధితురాలి కుమారుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్​ అసిస్టెంట్​, జూనియర్ అసిస్టెంట్​లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

దీనిని కూడా చదవండి : Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు

Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..
TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Hyderabad Metro Disruption | హైదరాబాద్​లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
Gulf Telugu Advisory | గల్ఫ్​లో ఉన్న తెలుగు వారికి సీఎం కీలక సూచనలు
TAGGED:acb arrestsbribery caseCorruption Case Indiagovernment officialsHyderabad newspolice corruption
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Police | Kamareddy Police | కామారెడ్డిలో గంజాయి పట్టివేత.. 9 మంది అరెస్ట్
Next Article Chanakya Success Principles Chanakya Success Principles | ధనవంతులుగా అవ్వాలనుకుంటున్నారా.. ఆచార్య చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోవాల్సిందే!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?