అక్షరటుడే, కామారెడ్డి: ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. ఉదయం 10 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చేరుకుని సోదాలు ప్రారంభించారు. దాంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ACB Raids in Kamareddy | గత కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు..
గత కొన్నేళ్లుగా కామారెడ్డి మున్సిపాలిటీపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి డబ్బులు తీసుకోకుండా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో ఏసీబీ అధికారులు కార్యాలయంలోని అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో అధికారులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. రికార్డుల తనిఖీల్లో ఎలాంటి విషయాలు భయటపడతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. అటు రాజకీయ నాయకులు సైతం ఆందోళనకు గురవుతున్నట్లుగా తెలుస్తోంది. కార్యాలయంలో ఏం జరుగుతోంది అని పలువురికి ఫోన్లు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి..: RSS Ugadi Utsavam | 19న ఆర్ఎస్ఎస్ ఉగాది ఉత్సవం

