అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB raids Tahsildar | కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అందిన కాడికి దండుకొని భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నా.. లంచాలకు మరిగిన అధికారుల తీరు మారడం లేదు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తహశీల్దార్ (Gajwel Tahasildar) కమతం శ్రవణ్ కుమార్ ఇంటిపై శనివారం ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తుల కేసు నమోదు కావడంతో అధికారులు తహశీల్దార్ ఇంటితో పాటు మరో రెండు చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రవణ్ కుమార్ తన సర్వీసు కాలంలో చట్టవిరుద్ధమైన పద్ధతులు, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులను సంపాదించారనే ఆరోపణలపై కేసు నమోదు అయింది.
ACB raids Tahsildar | రూ.4 కోట్ల ఆస్తులు
నిందితుడి ఇంట్లో, మరో 2 ప్రదేశాలలో అధికారులు సోదాలు చేశారు. అతడికి రెండు ఇళ్లు, ఆరు ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్మెంట్, కరీంనగర్ (Karimnagar) నగరంలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ఉన్నట్లు గుర్తించారు. రూ. 4,20,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 15,66,000 విలువైన గృహోపకరణాలు, రూ. 11,90,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ACB raids Tahsildar | అధికార దుర్వినియోగం
తహశీల్దార్ శ్రవణ్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఈ స్థిర, చరాస్తులను సంపాదించాడని సోదాల్లో అధికారులు గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆయా ఆస్తుల విలువ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.

ACB raids Tahsildar | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ACB has registered a Disproportionate Assets case against Kamatam Sravan Kumar, Tahsildar of Gajwel Mandal, Siddipet district
Searches at his residence and two other locations reportedly revealed assets worth around ₹4 crore, including:
• 2 houses
• 1 apartment with 6 flats… pic.twitter.com/OLvGPbGoxC
— Naveena (@TheNaveena) March 7, 2026

