అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Suicide Case | ప్రముఖ నటి సుభాషిణి (36) ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై (Chennai)లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ గొడవల కారణంగానే సూసైడ్ చేసుకుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Actress Suicide Case | భర్తతో వీడియో కాల్
సుభాషిణి ఆత్మహత్య చేసుకునేముందు భర్తతో వీడియో కాల్‌లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సుభాషిణి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సానుభూతి తెలుపుతున్నారు.
Actress Suicide Case | ప్రముఖ బుల్లితెర నటి..
ప్రముఖ బుల్లితెర నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకోవడం తమిళ ఇండస్ట్రీ (Tamil Film Industry)లో తీవ్ర చర్చకు దారితీసింది. మరికొన్ని రోజుల్లో ఆమె బర్త్‌డే ఉన్న నేపథ్యంలో సూసైడ్‌కు పాల్పడడం కలకలం రేపుతోంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో.. భర్తతో వాగ్వాదం అనంతరం మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని తన అపార్ట్ మెంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Actress Suicide Case | సుభాషిణిది శ్రీలంక
శ్రీలంక (Sri Lanka)కు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరు (Bengaluru)లో నివాసరం ఉంటోంది. షూటింగ్‌ల నిమిత్తం చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియళ్లు సినిమాల్లో నటిస్తోంది. కాగా.. సుభాషిణి ‘కయల్’ అనే టీవీ సీరియల్ ద్వారా గుర్తింపు పొందింది.
ఇది కూడా చదవండి..: Delhi Assembly Car Incident | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొని లోనికి దూసుకెళ్లిన కారు
