Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణ

Adilabad Airport | త్వరలో ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు : సీఎం రేవంత్​రెడ్డి

ఆదిలాబాద్​ ఎయిర్​పోర్టు నిర్మాణానికి త్వరలో శిలాఫలకం వేస్తామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 8:19 సా.
Srinivas Kolluri
3 రోజులు ago
Share
Adilabad Airport

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Adilabad Airport | ఆదిలాబాద్ (Adilabad)​ ఎయిర్​పోర్టు నిర్మాణానికి త్వరలో శిలాఫలకం వేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించామని చెప్పారు. వీలైతే జూన్ 2 నాటికి ఎయిర్​ పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Contents
  • Adilabad Airport | ఎన్నికలప్పుడే రాజకీయాలు
    • Adilabad Airport | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆదిలాబాద్​లో సీఎం సోమవారం “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ” బహిరంగ సభలో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు (Pranahita-Chevella Project)ను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఆదిలాబాద్​కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత తనది పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్​ కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని వెల్లడించారు. ఆదిలాబాద్​లో త్వరలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి కూడా భూసేకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

Adilabad Airport | ఎన్నికలప్పుడే రాజకీయాలు

ఎన్నికలప్పుడే రాజకీయాలు అని సీఎం అన్నారు. తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు.
ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశామని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని వెల్లడించారు.

Adilabad Airport | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సీఎం తన పర్యటనలో భాగంగా బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామం, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బోథ్ మండలం పొచ్చెరలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్లో వంతెనను ప్రారంభించారు.

దీనిని కూడా చదవండి : Basara Temple Development | బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపన

Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అభివృద్ధి బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్​
Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
HIV Injection Attack | పెళ్లికి నిరాకరించిన యువతి… హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చిన యువకుడు
Hyderabad Terror Links | హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రలింకులు వెలుగులోకి.. విజయవాడ కేసుతో సంబంధం ఉన్న‌ మహిళ అరెస్ట్
TAGGED:adilabad airportIndia aviationinfrastructure projectsregional connectivityRevanth ReddyTelangana development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Housing Scheme | Indiramma Housing Scheme | అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: కాంగ్రెస్​ నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
Next Article Uniform Civil Code Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?