అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adulterated Food Seizure | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రోజుకో కల్తీ దందా వెలుగు చూస్తోంది. ఆ వార్తలు చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇన్ని రోజులుగా తాము తింటున్నది విషమని తెలిసి ఆందోళనకు గురి అవుతున్నారు.
హైదరాబాద్ మైలార్‌దేవపల్లి (Mylardevpally) పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న ఎస్.కె.ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ (S.K.R. Food Products) ప్రాంగణంలో హెచ్–ఫాస్ట్ బృందం దాడులు చేసింది. 4,032 కిలోకల కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకుంది. నగరంలోని రెస్టారెంట్లు, హోల్‌సేల్, కిరాణ దుకాణాలకు దీనిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Adulterated Food Seizure | నిందితుడి అరెస్ట్
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హెచ్–ఫాస్ట్ టీమ్ (H-Fast Team) ఎస్.కె.ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీ చేసింది. హసన్ అలీ రుపానీ అనే నిందితుడు అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీని కోసం నాసిరకం ముడి పదార్థాలు, వెల్లుల్లి తొక్కలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఎసిటిక్ యాసిడ్, క్శాంతన్ గమ్ పౌడర్ వంటి పదార్థాలను కలుపుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మొత్తం రూ.22 లక్షలు విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: GHMC Property Seizure | హైదరాబాద్‌లో మాజీ సీఎం ఇల్లు సీజ్
