అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adulterated Ginger Garlic Paste | గ్రేటర్ హైదరాబాద్‌లో కల్తీ ఆహార పదార్థాల తయారీ సర్వ సాధారణంగా మారింది. పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా మహా నగరంలోని మలక్‌పేట పరిసరాల్లో కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న యూనిట్ వెలుగుచూసింది. సదరు యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి భారీ మొత్తంలో సరకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు.
Adulterated Ginger Garlic Paste | టాస్క్ ఫోర్స్ దాడి
Hyderabad Commissioner’s Task Force కు చెందిన ఖైరతాబాద్ జోన్ బృందం గ్రేటర్ నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఉన్న Shehzada Food Master అనే యూనిట్‌పై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. Mallepallyలో (Habeeb Nagar పోలీస్ స్టేషన్ పరిధిలో) ఈ యూనిట్ ఉంది.
యూనిట్ యజమాని Mohammed Farooq (50)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఈ కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు.
Adulterated Ginger Garlic Paste | రసాయనాలు కలిపి..
దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్, అసిటిక్ యాసిడ్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలు కలిపి తయారు చేస్తున్నట్లు తేలింది. సదరు పేస్ట్‌ను మూతలేని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ ఉంచుతున్నారని.. దానిని దుమ్ము, ఈగల మధ్యే నిల్వ ఉంచడం వల్ల అది పూర్తిగా అసురక్షితంగా మారినట్లు అధికారులు గుర్తించారు.
కాలం చెల్లిన లైసెన్స్
యూనిట్ Food Safety and Standards Authority of India (FSSAI) లైసెన్స్ 2018లోనే గడువు ముగిసిందని అధికారులు నిర్ధారించారు. అయినా కూడా అల్లం – వెల్లుల్లి పేస్ట్‌ను హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారీగా సరకు స్వాధీనం
సుమారు 875 కిలోల ముడి అల్లం – వెల్లుల్లి, 1,090 కిలోల కల్తీ అల్లం–వెల్లుల్లి పేస్ట్, కల్తీకి ఉపయోగించే రసాయనాలు, గ్రైండింగ్ యంత్రాలు, ఒక మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ.2.2 లక్షలు ఉంటుందని అంచనా.
నిందితుడితోపాటు స్వాధీనం చేసిన వస్తువులను Habeeb Nagar Police Stationకు అధికారులు అప్పగించారు. ఈ ఘటనపై Cr. No. 53/2026గా కేసు నమోదు చేశారు. Bharatiya Nyaya Sanhitaలోని సెక్షన్ 318(4), 275 కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

