అక్షరటుడే, కామారెడ్డి: Advocates’ Bar Association | కామారెడ్డి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ (Kamareddy news) ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్షుడిగా బత్తుల నారాయణ, (bar association) ప్రధాన కార్యదర్శిగా బండారు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రాజు, సంయుక్త కార్యదర్శిగా భార్గవ్ చంద్ర భోపాల్, కోశాధికారిగా (advocate elections) విఠల్ రావు, లైబ్రరీ సెక్రెటరీగా దేవేందర్ గౌడ్, క్రీడల కార్యదర్శిగా యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Advocates’ Bar Association | కార్యవర్గ సభ్యుల మధ్య పోటీ..
కార్యవర్గ సభ్యులకు పోటీ ఉండడంతో ఆరుగురు పోటీలో నిలవగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో గంగరాజు, సంజిత్, షేక్ ఇర్ఫాన్ హుస్సేన్ గెలుపొందారు. ఈ కార్యవర్గం ఏడాది (legal community) పాటు కొనసాగుతుందని, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సూచనల మేరకు ప్రతి ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి అమృతరావు వైద్య తెలిపారు.
ఇది కూడా చదవండి: Jeevan Reddy Targets Revanth Reddy | మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలనే నినాదం వచ్చింది: జీవన్‌రెడ్డి
