అక్షరటుడే, కామారెడ్డి: Agriculture Sector Crisis | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్నదని,(kamareddy news) ఆర్థిక వేత్త పాపారావు, సీపీఐఎంఎల్ మాస్‌లైన్(CPIML Massline) రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రాంచందర్‌లు విమర్శించారు. కామారెడ్డి పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభల ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించారు.
Agriculture Sector Crisis |వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గితే..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల (indian agriculture) ధరలు పెరిగితే పట్టణ కార్మికుల జీవన విధానం(political criticism) పెరుగుతుందన్నారు. కానీ.. కార్పొరేట్ల లాభాలు తగ్గుతాయని (minimum support price, ) భావించి కనీస మద్దత్తు ధరను పెరగనీయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో హెక్టార్ లోపు భూమి కలిగిన రైతులు 69 శాతం ఉన్నారని.. ఫలితంగా రైతులు కూలీ చేసుకోవాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఉందన్నారు. ఉత్పత్తులకు, ప్రజల జీవన ప్రమాణలకు మధ్య వ్యత్యాసం పెరిగి ప్రజలు అర్థాకలికి గురవుతున్నారన్నారు. పాలకులు వ్యవసాయ కూలీలను విస్మరించి ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
Agriculture Sector Crisis | కేంద్రం ఉపాధిని విస్మరించింది..
కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉపాధిని విస్మరించడంలో భాగంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడానికి పేరుతో పాటు, చట్టం స్థానంలో బిల్లుగా నామమాత్రంగా మార్చివేశారని మాస్‌లైన్ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తానేమీ తక్కువ కాదని, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన (farm labour rights) ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇప్పటికీ ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీల( farmers issues india) వ్యతిరేక విధానాలపై సమరాశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, రామకృష్ణ, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము, పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి, పీవైఎల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణ, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Congress Party Positions | కాంగ్రెస్‌పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

