Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు

జాతీయంటెక్నాలజీ

AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్కారుకు కాసుల పంట పండించబోతోంది. ఏఐ ఆధారిత వ్యవస్థ అందుబాటులోకి రావడంతో త్వరలో భారత్‌లో టోల్ వసూళ్లు రూ. 4 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 10:45 ఉద.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
AI Toll Collection

అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Toll Collection | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సంచలనాలు సృష్టిస్తోంది. దీని వల్ల ఓవైపు పని సులువు అవుతుండగా.. మరోవైపు ఉద్యోగాలు ఊడుతాయన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే ఇది పలు కంపెనీలపై కనకవర్షాన్ని కురిపిస్తోంది. ప్రభుత్వానికి సైతం మేలు జరుగబోతోంది.

Contents
  • AI Toll Collection | ఆటోమెటిక్ గా టోల్ కట్..
    • AI Toll Collection | ప్రయోజనాలు..
      • AI Toll Collection | ఈ ఏడాది చివరి నాటికి..

ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశం పూర్తిగా డిజిటలైజ్డ్, అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ వైపు పయనిస్తోందని పేర్కొన్న ఆయన.. నూతన విధానం వల్ల దేశంలో టోల్ వసూళ్లు (Toll Collections) త్వరలో ఏటా రూ. 3.5 నుంచి 4 లక్షల కోట్ల వరకు పెరగవచ్చన్నారు. ప్రస్తుతం ఇది సంవత్సరానికి రూ. 80 వేల కోట్లుగా ఉంది. అంటే టోల్ వసూళ్లు నాలుగింతలపైనే పెరిగే అవకాశాలున్నాయి.

AI Toll Collection | ఆటోమెటిక్ గా టోల్ కట్..

ఈ ఏడాది చివరి నాటికి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థను అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత టోల్ వ్యవస్థ. దీని వల్ల భౌతిక టోల్ ప్లాజాల అవసరం ఉండదు. వాహనాలు ఆగకుండానే, బ్యారియర్ లేకుండానే టోల్ చెల్లింపులు జరుగుతాయి. నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్ ఇంటిగ్రేషన్ (FASTag Integration), ఏఐ సాంకేతికతల ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ కట్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం, ఆటోమొబైల్ రంగం విస్తరించడం, రహదారులపై ట్రాఫిక్ పెరగడం వంటి కారణాలతోపాటు ఏఐ ఆధారిత వ్యవస్థ వల్ల ఈ ఏడాది చివరి నాటికి టోల్ వసూళ్లు భారీగా పెరుగుతాయని గడ్కరీ అంచనా వేస్తున్నారు.

AI Toll Collection | ప్రయోజనాలు..

టోల్ ప్లాజా (Toll Plaza)ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది వాహనదారులకూ సౌకర్యంగా ఉంటుంది.ఇంధనం ఆదా అవుతుంది. భౌతిక టోల్ ప్లాజాలు ఎత్తివేయడం వల్ల ఏటా సుమారు రూ. 1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని భావిస్తున్నారు.టోల్ ఎగవేతలు తగ్గి, వసూళ్లు పెరిగే అవకాశాలుంటాయి. కొత్త విధానం అమలు తర్వాత ఏటా అదనంగా రూ. 6 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా.

AI Toll Collection | ఈ ఏడాది చివరి నాటికి..

దేశవ్యాప్తంగా ఈ ఏఐ ఆధారిత బ్యారియర్ ఫ్రీ టోల్ సిస్టమ్ 2026 చివరి నాటికి 100 శాతం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రాజెక్టులు విస్తరించడం, హైవేలపై ట్రాఫిక్ పెరగడం, డిజిటల్, లీక్ ప్రూఫ్ టోలింగ్ వ్యవస్థ అమలు చేయడం వల్ల ఈ లక్ష్యం సాధ్యమవుతుందని గడ్కరీ పేర్కొంటున్నారు. ఈ మార్పులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..: Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ

Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
Joint Tax Filing | దంపతుల కోసం జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ తేవాలి.. రాజ్యసభలో రాఘవ్ చద్దా!
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
TAGGED:AI Toll CollectionArtificial IntelligenceFASTag IntegrationMinister Nitin GadkariToll CollectionsToll Plaza
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article PSL Ball Tampering PSL Ball Tampering | పీఎస్ఎల్ 2026లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. వీడియోలో అడ్డంగా దొరికిన స్టార్ ప్లేయ‌ర్
Next Article Maoist Leader Surrender Maoist Leader Surrender | లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?