అక్షరటుడే, ఎల్లారెడ్డి: AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Thota Lakshmi Kantha Rao) నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం వివరాలు వెల్లడించింది.
AICC Observer Appointment | ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా..
‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharashtra)లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకుల (AICC Observer ) నియామకాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. అధిష్టానం తనపై ఎంతో నమ్మకం ఉంచి పదవి కట్టబెట్టిందని.. వారి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా విధులు నిర్వర్తిస్తానన్నారు. ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు లక్ష్మీకాంతారావు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య

